Site icon HashtagU Telugu

Coconut Chicken Stripes: కొబ్బరి చికెన్ స్ట్రిప్స్ ఇలా చేస్తే చాలు.. కొంచం కూడా మిగలదు?

Mixcollage 03 Jan 2024 07 28 Pm 2825

Mixcollage 03 Jan 2024 07 28 Pm 2825

మామూలుగా చాలామందికి ఒకే విధమైన వంటలు తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది. అందుకే ఏవైనా వెరైటీగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ వెరైటీ వంటకాలను ఎలా తయారు చేయాలి ఎందుకు ఏమేమి కావాలి అన్నది చాలా మందికి తెలియదు. మీరు కూడా ఏదైనా సరికొత్తగా రెసిపీ ట్రై చేయాలని అనుకుంటున్నారా. అయితే కొబ్బరి చికెన్ స్ట్రిప్స్ ని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొబ్బరి చికెన్ స్ట్రిప్స్ కావలసిన పదార్థాలు

బోన్ లెస్ చికెన్ స్ట్రిప్స్ – పది
మైదా – ఒక కప్పు
పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు
బ్రెడ్ పొడి – ఒక కప్పు
కోడిగుడ్లు – రెండు
మిరియాల పొడి – ఒక చెంచా
కారం – అర చెంచా
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి సరిపడా

కొబ్బరి చికెన్ స్ట్రిప్స్ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా చికెన్ స్ట్రిప్స్ ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక బౌల్ లో మైదా, కొబ్బరి, మిరియాల పొడి, ఉప్పు, కారం, కోడిగుడ్ల సొన వేసి బాగా కలపాలి. చికెన్ స్ట్రిప్స్ ని ఈ మిశ్రమంలో వేసి రెండు నిమిషాలు ఉంచాలి. ఆపై స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె బాగా కాగిన తరువాత చికెన్ స్ట్రిప్స్ ను బ్రెడ్ పొడిలో దొర్లించి నూనెలో వేయాలి. బంగారు రంగు వచ్చే వరకూ వేయించి తీసేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి చికెన్ స్ట్రిప్స్ రెడీ.

Exit mobile version