Stove Cleaning Tips: స్టౌని ఇలా క్లీన్ చేయండి.. మెరిసిపోతోంది..

ఇండియన్ కిచెన్ విషయానికొస్తే.. క్లీనింగ్ అనది చాలా ముఖ్యం. ఎంత బాగా క్లీన్ చేస్తే అంత బావుంటుంది ఇల్లు.

Published By: HashtagU Telugu Desk
Clean The Stove Like This.. Glistening..

Clean The Stove Like This.. Glistening..

కిచెన్ క్లీనింగ్ (Stove Cleaning) అనేది అతి పెద్ద టాస్క్. దీనిని ఈజీగా చేసేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వొచ్చు. క్లీన్ చేసేటప్పుడు పరిశుభ్రత అేది ముఖ్యం. వంటగదిని క్లీన్ చేయడం ఓ పెద్ద పనిగా చూస్తాం. కానీ, దీనిని క్లీన్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే నూనె మరకల నుండి మసాలాల వరకూ అన్ని మరకలు పోయి క్లీన్‌గా ఉంటుంది. అందుకోసం ఏమేం చిట్కాలు పాటించొచ్చో తెలుసుకుందాం.

నిమ్మరసం:

గ్యాస్ స్టౌ క్లీనింగ్‌ (Stove Cleaning) కి నిమ్మరసం, తొక్క రెండు బాగా పనిచేస్తాయి. వీటిని వాడి గ్యాస్‌స్టౌ పై మరకలని ఈజీగా తొలగించొచ్చు. ఇందుకోసం జిడ్డు మరకలపై నిమ్మ తొక్కని పెట్టి రబ్ చేయండి. కాసేపు రబ్ చేశాక నీటితో ఈ స్టౌన్ క్లీన్ చేయండి.

బేకింగ్ సోడా:

ఒక్క బేకింగ్ సోడా ఉంటే చాలు.. ఎన్నో పనులు చేసుకోవచచు. గ్యాస్ స్టౌని తళతళ మెరిపించడంలో బేకింగ్ సోడా ది బెస్ట్. దీనిని కొద్దిగా తీసుకుని అందులో నిమ్మరసం లేదా వైట్ వెనిగర్ కలపి పేస్ట్‌లా చేయండి. ఇలా తయారైన పేస్ట్‌ని చక్కగా గ్యాస్‌పై నేరుగా అప్లై చేసి కాసేపు ఉంచి ఆ మరకలని క్లీన్ చేయండి.

వైట్ వెనిగర్:

వెనిగర్‌ని ఇంట్లోని మచ్చలు పోగొట్టేందుకు వాడుతుంటాం. కిచెన్‌లో స్టౌపై మరకలు ఉంటే ముందుగా వెనిగర్ తీసుకుని ఆ మరకలపై కొద్దిగా చల్లండి. ఓ ఐదారు నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈజీగా మరకలు పోతాయి.

డిష్ వాష్ లిక్విడ్:

డిష్ వాష్ లిక్విడ్ కేవలం గిన్నెలు క్లీన్ చేసేందుకు మాత్రమే కాదు. కిచెన్‌ని మెరిపించేందుకు కూడా పని చేస్తుంది. దీంతో కిచెన్‌ని మెరిపించొచ్చు. ముందుగా స్టౌపై మరకలు ఉంటే స్పాంజిపై కొద్దిగా లిక్విడ్ వేయండి. దీంతో స్టౌని క్లీన్‌గా తోమి కడగండి. ఇలా చేయడం వల్ల స్టౌ క్లీన్ అవుతుంది.

ఉల్లిపాయలతో:

ఉల్లిపాయలు ప్రతి ఇళ్ళల్లోనూ ఉంటాయి. వీటిని రుచికి, ఆరోగ్యానికి మాత్రమే కాదు. క్లీనింగ్‌కి కూడా వాడొచ్చొని మీకు తెలుసా.. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని 20 నిమిషాల పాటు నీటిలో ఉడికించాలి. ఈ నీటిని కాసేపు చల్లార్చాలి. అదే నీటిని స్ప్రే చేసి ఓ ఐదారు నిమిషాలు ఉంచి చక్కగా క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మరకలు పోతాయి.

Also Read:  Lung Problems: లంగ్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటే బయటపెట్టే 7 సంకేతాలు

  Last Updated: 25 Feb 2023, 02:19 PM IST