Site icon HashtagU Telugu

Summer: మట్టి కుండ నీరే మహా ఔషధం.. ఎందుకో తెలుసా

5 Benefits Of Drinking Clay Pot Water For Our Body

5 Benefits Of Drinking Clay Pot Water For Our Body

Summer: ఎండ వేడిని తట్టుకోవడానికి సాధారణం కంటే ఎక్కువ నీరు అవసరమతుంది. తరచుగా రిఫ్రిజిరేటర్ నుండి నీటిని సేవించటం వల్ల శరీర ఉష్ణోగ్రతను దెబ్బతీస్తుంది. రిఫ్రిజిరేటర్ వాటర్ తాగటంవల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రిఫ్రిజిరేటర్ వాటర్ సేవించటం వల్ల హృదయ స్పందనలో మార్పులు, మలబద్ధకం, తలనొప్పులు, కొవ్వు నిల్వ, వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే మట్టి కుండలో నీటిని నిల్వ చేసుకుంటే నీరు సహజంగా చల్లబడతాయి. ఈ పురాతన కాలం నుండి వస్తున్న ఈ విధానం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా నిపుణులు సైతం చెబుతున్నారు.
మట్టి కుండలో నీటిని నిల్వ చేయడం వల్ల నీటి సహజ శీతలీకరణకు సహాయపడుతుంది. మట్టికుండ ఉపరితలంపై చిన్న శ్వాసక్రియ రంధ్రాలను కలిగి ఉంటుంది. ఈ రంధ్రాల ద్వారా నీరు త్వరగా ఆవిరైపోతుంది. రిఫ్రిజిరేటర్ లోని చల్లటి నీటిని తాగడం వల్ల గొంతులో దురద మరియు పుండ్లు పడవచ్చు. మట్టి కుండ నీరు సరైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది, ఇది గొంతుపై సున్నితంగా ఉంటుంది. దగ్గు లేదా జలుబును తీవ్రతరం చేయదు.

మట్టి కుండలోని నీటిని చల్లబరచడానికి మాత్రమే కాకుండా సహజంగా శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ పోరస్ మైక్రో-టెక్చర్ నీటిలోని కలుషితాలను అడ్డుకుంటుంది. నీటిని త్రాగడానికి సురక్షితంగా చేస్తుంది. మట్టి కుండ నీటిలో సమృద్ధిగా ఉండే ఖనిజాలు మరియు పోషకాలను చెక్కుచెదరకుండా ఉంచుతుంది.