మామూలుగా మనం తరచుగా చపాతీని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడు తినే చపాతి కాకుండా అప్పుడప్పుడు కొంతమంది వెరైటీగా కూడా ట్రై చేస్తూ ఉంటారు. కొత్తిమీర చపాతీ పుదీనా చపాతి అంటూ రకరకాల చపాతీలను ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా చుక్కకూర చపాతిని తిన్నారా.. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు :
చుక్కకూర – మూడు కట్టలు
గోధుమ పిండి – ఒక కప్పు
జీలకర్ర పొడి -అర స్పూను
ధనియాల పొడి – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
కారం – అర స్పూను
నూనె – మూడు స్పూన్లు
తయారీ విధానం :
చుక్కకూరను కట్ చేసి శుభ్రంగా నీళ్లలో కడుక్కోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూను నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక చుక్కకూర వేసి వేగించాలి. ఉప్పు, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి కూడా వేసి కలపాలి. జీలకర్ర దగ్గరగా అయ్యాక స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు చపాతీ పిండిని కలిపేందుకు సిద్ధం చేయాలి. అందులో చుక్క కూర మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీల్లా ఒత్తుకుని పెనంపై వేసి కాల్చుకోవాలి.