Site icon HashtagU Telugu

Life Expectancy Report : ఎక్కువ కాలం జీవించేది ఎవరు…భారతీయులా..? చైనీయులా?

china

china

భారతీయుల కంటే చైనీయులే ఎక్కువగా కాలం జీవస్తున్నారని Life Expectancy Report వెల్లడించింది. చైనా పౌరుల ఆయుర్దాయం 77.93 సంవత్సరాలని…ఇది ఎగుమ మధ్య ఆదాయ దేశాల విభాగంలో అత్యధికమని ఎన్ హెచ్సీ విభాగం డైరెక్టర్ మావో కునాన్ తెలిపారు. 2013 నుంచి హాంకాంగ్ ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయం ఉన్న దేశంగా కొనసాగుతోంది. హాంకాంగ్ లో పురుషులు, స్త్రీల సగటు ఆయుర్దాయం 85 సంవత్సరాల కంటే ఎక్కువ. అత్యధిక ఆయుర్దాయం పరంగా జపాన్, మకావు కూడా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి.

లెటెస్టు రిపోర్ట్స్ ప్రకారం…2020నాటికి 60లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల చైనీస్ ప్రజల సంఖ్య 264 మిలియన్లకు చేరుకుంటుంది. ఇది ఆ దేశ మొత్తం జనాభాలో 18.7శాతంగా ఉంటుంది. గతఏడాది విడుదల చేసిన డేటా ప్రకారం..చైనా కమ్యూనిస్టు పార్టీ పాలన ప్రారంభమైన 35ఏళ్లతో పోలిస్తే 2019 సంవత్సరంలో చైనా ప్రజల ఆయుర్దాయం 77.03కిపెరిగింది.

భారతీయుల ఆయుర్దాయం ఎంత
ఈ నివేదిక భారత్ గురించి ప్రస్తావించింది. 2020 ఏడాదిలో ఇక్కడి ప్రజల సగటు వయస్సు 70 ఏండ్లు అని పేర్కొంది. అదే సమయంలో భారత్ కంటే పాకిస్తాన్ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇక్కడి ప్రజల ఆయుర్దాయం 67 సంవత్సరాలని పేర్కొంది. అలాగే లండన్ ఆయుర్దాయం 81 సంవత్సరాలు, అమెరికా ఆయుర్దాయం 77ఏండ్లుగా ఉందని తెలిపింది. అదే సమయంలో జపాన్ ప్రజల సగటు వయస్సు 85 సంవత్సరాలు ఉండగా…స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా ప్రజల సగటు వయస్సు 83 సంవత్సరాలని పేర్కొంది. సింగపూర్ ఆయుర్దాయం 84 ఏళ్లు, ఇటలీ ఆయుర్దాయం 82 ఏళ్లుగా పేర్కొంది.

చైనాలో ఆయుర్దాయం పెరగడానికి కారణాలు..
ఆయుర్దాయం చెందడానికి ప్రధానంగా ఆరోగ్యవాతావరణంపై దృష్టి పెట్టింది. దాని బ్లూప్రింట్ లో ఆరోగ్యం పరిజ్ణానం, ఫిట్ నెస్, పొగాకు నియంత్రణ, ఈ సిగరెట్లను నిషేధించడం మద్యపాన నిషేధం, సరైన ఆహారం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. మెడికల్ జర్నల్ లాన్సెట్ 2021 నివేదిక ప్రకారం…పేదరికం లేకపోవడం, వ్యాధుల తగ్గుదల కారణంగా హాంకాంగ్ యొక్క ఆయుర్దాయం అధికంగా పేర్కొంది. అభివృద్ధితోపాట, ఆర్థిక శ్రేయస్సు , తగ్గిన ధూమపానం కూడా ఈ ఫలితాలను ఇచ్చినట్లు తెలిపింది.

Exit mobile version