Childrens Protection : చిన్న పిల్లలను AC , కూలర్ ముందు ఎక్కువసేపు ఉంచుతున్నారా?

చిన్న పిల్లలు కూడా ఎండకు తట్టుకోలేకపోతుంటారు అందుకని మనం వారిని Ac లేదా కూలర్ ఉన్నచోట ఉంచుతాము.

Published By: HashtagU Telugu Desk
Ac

Childrens Protection : ఎండాకాలం(Summer) రాగానే ఎండలు బాగా ఉంటున్నాయి. పెద్దవాళ్ళే ఎండలకు తట్టుకోలేక AC లేదా కూలర్ ముందు కూర్చుంటాము. అందరి ఇళ్లల్లో కూడా AC లు లేదా కూలర్ లు, ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. చిన్న పిల్లలు కూడా ఎండకు తట్టుకోలేకపోతుంటారు అందుకని మనం వారిని Ac లేదా కూలర్ ఉన్నచోట ఉంచుతాము. దీని వలన పిల్లలు వేడి నుండి ఉపశమనం చెందుతారు.

అయితే పిల్లలను AC లేదా కూలర్ ముందు ఉంచినప్పుడు వారి పైన దుప్పటి కప్పాలి. లేకపోతే వారికి జలుబు, దగ్గు వంటివి వస్తాయి.

AC వేసుకున్నప్పుడు ఫ్యాన్ కూడా వేసుకుంటే రూమ్ తొందరగా చల్లబడుతుంది. అయితే ఫ్యాన్ ఎక్కువ స్పీడ్ లో కాకుండా నార్మల్ స్పీడ్ లో ఉంచుకోవాలి. రూమ్ చల్లగా అయిన తర్వాత AC ఆఫ్ చేస్తే మంచిది.

చిన్న పిల్లలు ఒక నెల కంటే తక్కువ వయసు ఉన్నట్లైతే AC లేదా కూలర్ ముందు ఉంచినప్పుడు పిల్లల బాడీ మొత్తం కవర్ చేసి ఉంచాలి. బయట మార్కెట్ లో పిల్లల బాడీ మొత్తం కవర్ చేసి ఉంచే బట్టలు దొరుకుతున్నాయి. అవి తీసుకొని పిల్లలకు వాడవచ్చు.

అలాగే ఎక్కువ సేపు పిల్లల్ని AC, కూలర్ ముందు ఉంచరాదు.

ఒకేసారి AC టెంపరేచర్ నుంచి బయట ఎండలోకి పిల్లని పంపవద్దు. ఎక్కువ సేపు AC లో పిల్లని ఉంచి బయటకి తీసుకొస్తే బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. దానివల్ల చెమటలు ఎక్కవగా వచ్చే అవకాశం ఉంది.

అలాగే మరీ AC కి, కూలర్ కి దగ్గరగా కుర్చోపెట్టకూడదు. వాటికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి.

రోజంతా AC లోనే ఉంచడం అలవాటు చేయకూడదు పిల్లలకు. సాయంత్రం వేల బయట పార్క్ లేదా ఆచెట్లు ఎక్కువ ఉండే ప్రదేశాల్లో పిల్లల్ని తిప్పితే మంచిది.

 

Also Read : Benefits of Mango Seed: మామిడికాయే కాదు.. గింజ‌లు కూడా ప్ర‌యోజ‌న‌మే..!

  Last Updated: 28 Apr 2024, 05:58 PM IST