Smart Phones: స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అవుతున్న పిల్లలు, ఈ జాగ్రత్తలతో దూరం చేయొచ్చు

పిల్లలు అతిగా స్మార్ట్ ఫోన్స్ వాడడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

  • Written By:
  • Updated On - October 7, 2023 / 01:35 PM IST

Smart Phones: పిల్లలు అతిగా స్మార్ట్ ఫోన్స్ వాడడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. వారి మానసిక స్థితి సరిగ్గా ఉండకపోవడం. ప్రతి పనికి పేచీ పెట్టడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అదే విధంగా, పిల్లల్లో బుద్దిహీనత మిగతా సమస్యలు ఎదురవుతాయి. అంతేనా, వారి ఆలోచనా విధానం సరిగ్గా ఉండదు. దీంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగంటి పోతాయి. ఎందుకంటే పిల్లల భావోద్వేగాలను పంచుకున్నప్పుడు అనుభూతులు ఉంటాయి. ఇతరులు చెప్పేది ఓపిగ్గా విన్నప్పుడే చక్కటి భాష అలవడుతుంది. శారీరక సమస్యలు కూడా ఎదురవుతాయి.

ఎందుకంటే.. నేటి కాలంలో పిల్లలు బయటికి వెళ్లి ఆడుకోవడమే మరిచిపోయారు. ఈ కారణంగా వారి శారీరకంగా ఎలాంటి వ్యాయామం లేకుండా అయిపోయి శారీరక సమస్యలు ఎదురవుతున్నాయి. మితిమీరిన టెక్నాలజీ వాడడం పిల్లలకు అస్సలు మంచిది. కాబట్టి పిల్లలను ఎంత దూరంగా అంత మంచిది. అందుకోసం తల్లిదండ్రులు కొన్ని టెక్నిక్స్ పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే.. గ్యాడ్జెట్స్, టీవీ, ట్యాబ్లెట్స్ ఇలా వీటిని చూసేందుకు నిర్ణీత వేళల్ని నిర్దేశించాలి. దీంతో పిల్లల్లో సరైన మార్పు వస్తుంది. వారికి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు పిల్లలు త్వరగా వినరు. పేచి పెడతారు.

కాబట్టి.. అలా చేయకుండా.. వారి చేత మెల్లిగా అలవాట్లని దూరం చేయాలి. అదే విధంగా.. పిల్లలకి అవసరమైన బొమ్మల్ని పెట్టాలి. రెండు, మూడు రోజులకి కొత్త బొమ్మలు పెట్టాలి. ఇలా చేస్తుంటే వాటితో ఆడుకోవడానికి పిల్లలు ఆసక్తి చూపుతారు. కాబట్టి అలా చేస్తుండాలి. పిల్లలకు అనేక పనులను అలవాటు చేయాలి. గ్యాడ్జెట్స్‌కి దూరం చేసిన వారవుతాం.. అదే విధంగా.. పిల్లల్ని కాసేపు బయటికి వెళ్లి ఆడుకోమని చెప్పాలి.. వీలైతే వారితో పాటు మీరు కాసేపు ఆడండి. ఇలా చేస్తుంటే చాలా వరకూ మార్పు ఉంటుంది. వాళ్లకు ఇష్టమైన గేమ్స్, మంచి అభిరుచులు కంటిన్యూ చేసేలా ఎంకరేజ్ చేయాలి. అప్పుడే కొంతైనా స్మార్ ఫోన్ అడిక్షన్  నుండి బయటపడుతారు.