Chicken Washing: చికెన్‌ను ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టంగా తింటారు. అయితే దీనిని వండే ముందు శుభ్రం చేసే విషయంలో చాలామందికి అవగాహన ఉండదు. చికెన్ నుండి వచ్చే నీచు వాసనను పోగొట్టడానికి, బ్యాక్టీరియాను తొలగించడానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పచ్చి చికెన్‌ను నేరుగా నీటితో కడగడం వల్ల బ్యాక్టీరియా ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉంది. అందుకే నిమ్మరసం లేదా ఉప్పు నీటితో శుభ్రం చేయడం మేలని సూచిస్తున్నారు.
చికెన్‌ను శుభ్రం చేసే సరైన పద్ధతి
చికెన్‌ను తాకడానికి ముందే మీ చేతులను సబ్బు లేదా లిక్విడ్ హ్యాండ్‌వాష్‌తో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు నీరు చికెన్‌లోని బ్యాక్టీరియాను సమర్థవంతంగా తొలగిస్తుంది. ఒక లీటరు గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల ఉప్పు వేసి, అందులో చికెన్‌ను కొద్దిసేపు నానబెట్టాలి. ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాత చికెన్‌ను మళ్ళీ ఒకసారి సాధారణ నీటితో కడగాలి. దీనివల్ల చికెన్ శుభ్రపడటమే కాకుండా కూరలో ఉప్పు రుచి ఎక్కువ కాకుండా ఉంటుంది.
Also Read: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!
నిమ్మరసంతో కడగడం వల్ల కలిగే ప్రయోజనాలు
నిమ్మరసంలోని పులుపు, సువాసన పచ్చి చికెన్ నుండి వచ్చే నీచు వాసనను పూర్తిగా పోగొడుతుంది. అంతేకాకుండా నిమ్మరసంతో శుభ్రం చేయడం వల్ల చికెన్ మృదువుగా మారుతుంది. మసాలాలు ముక్కలకు బాగా పడతాయి.
చికెన్ కడిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చికెన్ శుభ్రం చేయడానికి ఎప్పుడూ సబ్బు లేదా డిటర్జెంట్ వాడకూడదు. వాటిలోని రసాయనాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఎక్కువ వేడి నీటితో కడగడం వల్ల బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందే అవకాశం ఉంది. చికెన్ కడిగేటప్పుడు ఆ నీటి తుంపర్లు వంటగదిలోని ఇతర సామాన్ల మీద లేదా ఆహారం మీద పడకుండా జాగ్రత్త వహించండి. దీనివల్ల బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టవచ్చు.
