Site icon HashtagU Telugu

Chicken Potato Kurma: ఎంతో రుచిగా ఉండే చికెన్ పొటాటో కుర్మా.. తయారీ విధానం?

Chicken Potato Kurma

Chicken Potato Kurma

ఈ రోజుల్లో చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో చేసిన వంటకాలు కంటే బయట చేసిన వంటకాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా హోటల్ రెస్టారెంట్ ఫుడ్ లను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో చికెన్ పొటాటో కుర్మా కూడా ఒకటి. ఈ రెసిపీని చాలామంది హోటల్ స్టైల్ లో తయారు చేయాలని అనుకున్నప్పటికీ ఎలా తయారు చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. మరి పార్టీ స్టైల్ లో హోటల్ స్టైల్ లో చికెన్ పొటాటో కుర్మా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చికెన్ పొటాటో కుర్మాకి కావాల్సిన పదార్థాలు:

నువ్వుల నూనె – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి – ఒకటి
అల్లం – కొద్దిగా
పచ్చిమిర్చి – 6
ధనియాల గింజలు – 1 టీ స్పూన్
నల్ల మిరియాలు – 1 టీ స్పూన్
ఉల్లిపాయలు – 3/4 కప్పు
టమోటాలు – 3
నీరు – సరిపడినన్ని
సోంపు గింజలు – 1/2 టీస్పూన్
లవంగాలు – 3
యాలకులు – 2
దాల్చిన చెక్క – 1
తెల్ల గసగసాలు – 1టీ స్పూన్
తురిమిన కొబ్బరి – ఒక కప్పు
బాదంపప్పులు – 25
పసుపు – కొద్దిగా
బంగాళాదుంపలు – 3
నిమ్మ రసం – కొద్దిగా

తయారీ విధానం:

పెద్ద పాన్ లేదా కడాయిలో నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు వేసి కొన్ని నిమిషాలు వేయించాలి. తర్వాత చికెన్ వేయాలి. అయితే ఈ రెసిపీ కోసం బోన్ ఉన్న చికెన్ ఉపయోగించాలి. తరువాత పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత ముందుగానే మసాలా చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేయాలి. తర్వాత కొద్దిగా నీరు జోడించాలి. తర్వాత పాన్‌ను ఒక మూతతో కప్పి 15 నిమిషాలు ఉడికించాలి. 15 నిమిషాల వంట తరువాత, బంగాళాదుంపలను అందులో వేయాలి. చికెన్ గ్రేవీతో బాగా కలపాలి. బంగాళాదుంపలు మెత్తగా ఉడికే వరకు మరో 15 నిమిషాలు ఉడికించాలి. తరువాత చివరగా, నిమ్మరసం కొత్తిమీర ఆకులను సన్నగా కత్తిరించి కుర్మా మీద చల్లుకోవాలి.

Exit mobile version