Chicken Masala Rice: స్పైసీ చికెన్ మసాలా రైస్.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా?

మామూలుగా మనం చికెన్ తో తయారు చేసిన ఎన్నో రకాల రెసిపీలను తినే ఉంటాం. చికెన్ కర్రీ చికెన్ మసాలా కర్రీ, చికెన్ గ్రేవీ, తందూరి చికెన్ కబాబ్, చిక

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 06:00 PM IST

మామూలుగా మనం చికెన్ తో తయారు చేసిన ఎన్నో రకాల రెసిపీలను తినే ఉంటాం. చికెన్ కర్రీ చికెన్ మసాలా కర్రీ, చికెన్ గ్రేవీ, తందూరి చికెన్ కబాబ్, చికెన్ బిర్యాని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రెసిపీలు ఉన్నాయి. అయితే చాలామంది ఈ వంటకాలను రెస్టారెంట్ హోటల్స్ లో చేసినట్టుగా ఎంతో టేస్టీగా చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎలా చేయాలో తెలియక ఏదో నచ్చినట్టుగా చేసుకుంటూ ఉంటారు. అయితే రెస్టారెంట్ స్టైల్ స్పైసీ చికెన్ మసాలా రైస్ ను ఇంట్లోనే సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చికెన్ మసాలా రైస్ కు కావలసిన పదార్ధాలు:

బోన్లెస్ చికెన్ – అర కేజీ
పచ్చిమిర్చి – రెండు
టమాటా – ఒకటి
కరివేపాకు – ఒక రెమ్మ
ఎగ్స్ – రెండు
ఉప్పు – తగినంత
కారం – తగినంత
పుదీనా – పావుకప్పు
కొత్తిమీర – పావు కప్పు
ఉల్లిపాయ – ఒకటి
గరం మసాలా పొడి – ఒక టీ స్పూన్
పసుపు – కొంచెం
నూనె – రెండు టేబుల్ స్పూన్స్
అల్లంవెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్
అన్నం – రెండు కప్పులు
లవంగాలు – మూడు
దాల్చినచెక్క – చిన్న ముక్క
షాజీర – కొద్దిగా

చికెన్ మసాలా రైస్ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా చికెన్ ను సన్నగా కట్ చేసుకుని శుభ్రం చేసి కడిగి కొద్దిగా ఉప్పు, కారం, వేసి ఉడికించి ఉంచుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచం నూనె వేడి చేసి అందులో ఎగ్స్ పగలు కొట్టి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అందులోనే నూనె వేసి లవంగాలు, చెక్క, షాజీర వేసి సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, తరిగిన టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆపై సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగాక ఉడికించిన చికెన్ ముక్కలు, వేయించిన ఎగ్స్ వేసి కారం, పసుపు వేసి కలిపి రెండు నిముషాలు వేయించాలి. చివరగా అన్నం, తగినంత ఉప్పు, గరం మసాలాపొడి వేసి సన్నని సెగపై అంతా బాగా కలిసేలా కలుపుతూ వేయించాలి. అంతే చికెన్ మసాలా రైస్ రెడీ.