Site icon HashtagU Telugu

Chicken Manchuria: ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉండే చికెన్ మంచూరియాని ఇంట్లోనే తయారు చేసుకోండిలా?

Mixcollage 06 Dec 2023 05 51 Pm 24

Mixcollage 06 Dec 2023 05 51 Pm 24

మామూలుగా మనం చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేస్తూ ఉంటాం. చికెన్ కబాబ్, చికెన్ కర్రీ, చికెన్ బిర్యాని,తందూరి చికెన్ ఇలా ఎన్నో రకాల వంటలను తినే ఉంటాం. అయితే ఎప్పుడు అయినా చికెన్ మంచూరియా ని తిన్నారా. ఒకవేళ తినకపోతే ఇంట్లోనే ఎంతో స్పైసీగా ఉండే చికెన్ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చికెన్ మంచూరియాకి కావలసిన పదార్థాలు

చికెన్ – పావుకేజీ
ఉల్లిపాయలు – రెండు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – అర టీ స్పూన్
పచ్చిమిర్చి – నాలుగు
కోడిగుడ్డు – ఒకటి
మైదాపిండి – చిన్న కప్పు
సోయాసాస్ – ఒక స్పూను
చిల్లీ సాస్ – కొద్దిగా
వెనిగర్ – ఒక స్పూను
కార్న్ ఫ్లోర్ – ఒక స్పూను
టమోటా సాస్ – ఒక టీ స్పూన్
ఉప్పు, నూనె – తగినంత

చికెన్ మంచూరియా తయారీ విధానం:

ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడగాలి. తర్వాత చికెన్‌ను మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిర్చి, కార్న్ ఫ్లోర్‌, తగినంత నీటితో కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలిలో నూనె పోసి చికెన్‌ ను దోరగా వేపి ప్లేటులోకి తీసుకోవాలి. మరో పాత్రలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, మిర్చి పేస్ట్‌ను కలిపి బాగా వేపుకోవాలి. ఇందులో సోయాసాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ చేర్చి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికాక ఈ మిశ్రమంలో వేయించిన చికెన్ పీస్‌ లను చేర్చి నాలుగు నిమిషాల పాటు వేయించాలి. అలాగే తగినంత ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేస్తే ఎంతో స్పైసీగా ఉండే చికెన్ మంచూరియా రెడీ.

Exit mobile version