Chicken Haleem: ఇంట్లోనే టేస్టీగా సింపుల్ చికెన్ హలీం ను తయారీ చేసుకోండిలా?

చికెన్ హలీం.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పండుగ రంజాన్. ఎక్కువగా ఈ పండుగ సమయంలోనే మనకు ఎక్కడ చూసినా కూడా ఈ హలీం ని తయారు

  • Written By:
  • Publish Date - January 5, 2024 / 07:50 PM IST

చికెన్ హలీం.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పండుగ రంజాన్. ఎక్కువగా ఈ పండుగ సమయంలోనే మనకు ఎక్కడ చూసినా కూడా ఈ హలీం ని తయారు చేస్తూ ఉంటారు. ముస్లిం ఈ పదార్థాలను ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే చాలామంది ఈ పదార్థం పేరు వినడమే కానీ ఎప్పుడు తిని ఉండరు. ఒక్కసారైనా ఇంట్లో ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎలా తయారు చేసుకోవాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా హలీం ని ఇంట్లోనే తయారు చేసుకోవాలని అనుకుంటున్నారా. అయితే చికెన్ హలీం ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చికెన్ హలీంకి కావలసిన పదార్థాలు

బోన్ లెస్ చికెన్ – 500 గ్రా
గోధుమ రవ్వ – 250 గ్రా
సెనగపప్పు – టేస్పూన్
బియ్యం – టేస్పూన్
పచ్చిమిర్చి – 5
అల్లం వెల్లుల్లి ముద్ద – టీ స్పూన్
పుదీనా – 1/2 కప్పు
కొత్తిమీర – 1/2 కప్పు
ఉల్లిపాయ – 2
పెరుగు – 1 కప్పు
ఉప్పు – తగినంత
పసుపు – టీ స్పూన్
కారం – టీ స్పూన్
గరం మసాలా – 1 టీ స్పూన్
మిరియాలపొడి – 1/2టీ స్పూన్
సొంటి పొడి – 1/2 టీ స్పూన్
పోట్లీ మసాలా – 1 చిన్న పాకెట్
లవంగాలు – 8
దాల్చిన చెక్క – 3 / 4 ముక్కలు
యాలకులు – 8
షాజీరా – 2 టీ స్పూన్
నూనె – 1/4 కప్పు
నెయ్యి – 5 టీ స్పూన్

తయారీ విధానం :

ఒక కుక్కర్లో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, సెనగపప్పు, బియ్యం, చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్ద, పైన చెప్పిన మసాలా దినుసులలో సగం పుదీనా, రెండు పచ్చిమిర్చి, సగం కొత్తిమీర. సగం చెంచాడు పసుపు వేయాలి. ఇందులో బయట మార్కెట్ లో దొరికే పోట్లీ మసాలా ఒక సన్నటి బట్టలో మూట కట్టి వేసి, తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత మూత తీసి గోధుమ రవ్వ వేసి కలిపి మూత పెట్టి మళ్లీ నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పొట్లీ మసాలా మూట తీసేసి ఉడికిన చికెన్ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ లేదా మందపాటి గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి.

ఇందులో మిగిలిన లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీర , అల్లం వెల్లుల్లి ముద్ద, మిగిలిన పచ్చిమిర్చి నూరి వేసి కొద్దిగా వేగాక కారం, మిరియాల పొడి, సొంటిపొడి, గరం మసాలా పొడి వేసి కలుపుతూ వేయించాలి. అలాగే ఇందులో కప్పుడు పెరుగు వేసి కలపాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న చికెన్ మిశ్రమం, తగినంత ఉప్పు వేసి సన్నని మంటమీద కలుపుతూ నిదానంగా ఉడికించాలి. హలీమ్ మొత్తం ఉడికి మంచి వాసన వస్తున్నప్పుడు నెయ్యి వేసి కలిపి మరి కొద్ది సేపు ఉంచాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మిగిలిన కొత్తిమిర, పుదీనా నూనెలో కరకరలాడేలా వేయించి పెట్టుకోవాలి. హలీమ్ మొత్తం ఉడికి నూనె, నెయ్యి కలిసి పైకి తెలుతుండగా దింపేసి సర్వింగ్ బౌల్‌లో వేసి వేయించిన ఉల్లిపాయ, కొత్తిమిర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేసి నిమ్మరసం పిండి సర్వ్ చేయాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ హలీం రెడీ.