Site icon HashtagU Telugu

‎Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Chia Seeds

Chia Seeds

‎Chia Seeds: ఇటీవల కాలంలో చియా సీడ్స్ వల్ల కలిగే లాభాల గురించి తెలియడంతో వీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే వీటిని చాలా మంది తీసుకుంటున్నారు కానీ, ఎలా తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న విషయాలు తెలియడం లేదు. ఈ చియా సీడ్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఎన్ని పోషకాలు ఉన్నా కూడా అవసరానికి మించి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా హానికరం అని చెబుతున్నారు. అందుకే వీటిని అతిగా తీసుకోకూడదట.

‎రోజూ మితంగా తీసుకుంటనే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. చియా సీడ్స్ పోషకాలన్నీ మనకు అందాలంటే తగిన మోతాదులో తీసుకోవాలట. పెద్దవాళ్లు రోజుకి రెండు టేబుల్ స్పూన్ల వరకు చియా సీడ్స్ తినవచ్చని, ఇంతకన్నా ఎక్కువగా అయితే తీసుకోకూడదని చెబుతున్నారు. కాగా చియా సీడ్స్ ని డైరెక్ట్ గా తీసుకోకూడదట. అంటే పొడిగా తీసుకోకూడదని, బదులుగా నీటిలో నానబెట్టి తినడం మంచిదని నీళ్లు, పాలు, పెరుగులో నానబెట్టి తినడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. ఈ చియా సీడ్స్ ని అందరూ తీసుకోకూడదట.

‎ కొందరు ఫైబర్ తక్కువగా తీసుకోవాల్సిన వాళ్లు ఉంటారు. అలాంటివారు ఈ చియా సీడ్స్ కి దూరంగా ఉండటమే మంచిదని,వీటిని డైట్ లో భాగం చేసుకునే ముందు వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు. చియా సీడ్స్ లో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయట. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయట. అలాగే వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకం, జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయట. అలాగే వీటిని తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుందట. అలాగే చర్మం హైడ్రేట్ గా, కాంతివంతంగా ఉంటుందని,అలాగే షుగర్ కంట్రోల్ లో ఉంటుందట. ముఖ్యంగా ఈ రెండూ శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి సహాయపడతాయని, బరువు తగ్గేందుకు కూడా తోడ్పడుతాయని చెబుతున్నారు.

Exit mobile version