Chettinad Chicken Biryani: చెట్టినాడ్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఒక్క ముక్క కూడా మిగల్చరు?

మామూలుగా మనం చికెన్ బిర్యాని చికెన్ కబాబ్ చికెన్ లెగ్ పీస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ లాంటి రెసిపీలను తరచుగా తింటూ ఉంటాం. అయితే ఎప్పుడు ఒకే విధమైన

  • Written By:
  • Publish Date - December 19, 2023 / 04:00 PM IST

మామూలుగా మనం చికెన్ బిర్యాని చికెన్ కబాబ్ చికెన్ లెగ్ పీస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ లాంటి రెసిపీలను తరచుగా తింటూ ఉంటాం. అయితే ఎప్పుడు ఒకే విధమైన రెసిపీలు కాకుండా అప్పుడప్పుడు ఏవైనా కొత్తగా కూడా తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు కూడా చికెన్ లో ఏదైనా ఒకసారి కొత్తగా తినాలని అనుకుంటున్నారా. అయితే ఎప్పుడైనా టేస్టీగా ఉండే చెట్టినాడ్ చికెన్ బిర్యాని తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చెట్టినాడ్ చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్ధాలు:

భాస్మతి బియ్యం – 2కప్పులు
చికెన్ – 500గ్రాములు
ఉల్లిపాయ ముక్కలు – 2
టమోటాలు – 2 తరిగినవి
పచ్చిమిర్చి ముక్కలు – 2
వెల్లుల్లి – 3
లవంగాలు – 3
పెరుగు – పావు కప్పు
అల్లం- కొద్దిగా
కారం- 1 టీస్పూన్
సాన్ఫ్ – 1 స్పూన్
లవంగాలు- 3
యాలకులు -3
ధనియాల పొడి – 1 స్పూన్
నూనె- 2 స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
నెయ్యి – 1 స్పూన్
కొత్తమీర – కొద్దిగా
పసుపు -1 టీస్పూన్

చెట్టినాడ్ చికెన్ బిర్యానీ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా బియ్యాన్ని బాగా కడిగి 20-30 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టాలి. వడపోసి పక్కన పెట్టుకోవాలి. చికెన్‌ని మ్యారినేట్ చేయడానికి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, కారంపొడి, ఉప్పును ఒక గిన్నెలో వేయండి. చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి. కనీసం గంటసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మందపాటి అడుగు ఉన్న పాన్‌లో నెయ్యి వేడి చేయండి. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు జోడించి బాగా వేగించాలి. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వేసి, ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. దీనికి, మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి మరికొన్ని నిమిషాలు ఉడికించాలి. తరిగిన టమోటాలు, పచ్చిమిర్చి, మిరపకాయలు పసుపు వేసి బాగా కలపాలి. తరువాత, పెరుగు, కొత్తిమీర వేసి అన్నింటిని కలిపి సుమారు 4-5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఈ చికెన్ మసాలాను వండిన అన్నంతో కప్పి, పైన వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పులు, ఎండుద్రాక్ష వేయండి. గాలి బయటకు రాకుండా మూతను కవర్ చేయండది. అది 15-20 నిమిషాలపాటు సన్నని మంటమీద ఉడికించాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే చెట్టినాడ్ చికెన్ బిర్యాని రెడీ.