Site icon HashtagU Telugu

Chanakya Niti: చివరి రోజుల్లో పశ్చాత్తాపం ఉండకూడదంటే 3 పనులు చెయ్యాల్సిందే!

Chanakya Niti

Chanakya Niti

మన జీవితంలో ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం. అయితే అందులో కొన్నింటిని త్వరగా పూర్తి చేసేవి మరికొన్ని నిదానంగా పూర్తి చేసే పనులు ఉంటాయి. అయితే కొన్ని ముఖ్యమైన పనులను వెంటనే చేయడం అలవాటు నేర్చుకోవాలి. లేదంటే ఆ తర్వాత చివరికి పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఈ విషయాలతో పాటు ఎన్నో విషయాల గురించి ఆచార్య చాణక్య తన నీతి గ్రంథంలో అటువంటి విషయాల గురించి ప్రస్తావించాడు. అయితే ఈ పనులను సంతోషంగా చేసే వ్యక్తి జీవితంలో ఆనందంగా ఉంటాడని, అతడు మరణించే సమయంలో కూడా తృప్తిగా మరణిస్తాడని చెప్పాడు. మరి ఆ మూడు పనుల ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పుట్టిన ప్రతి వ్యక్తి అన్ని విధులకు, బాధ్యతలకు కట్టుబడి ఉంటాడు. వ్యక్తిగత పనులను సమయానికి చేయడంతో పాటు ఆరోగ్యంగా ఉంటూనే కుటుంబ బాధ్యతలను కూడా నిర్వహించాలలి. ఒక వ్యక్తికి వ్యాధి వచ్చినప్పుడు అతను తన పనిని చేయలేకపోతాడు. అతడి మరణం కూడా అనుకోకుండా జరిగిపోతుంది. కాబట్టి కొన్ని పనుల కోసం వృద్ధాప్యం వరకు వేచి ఉండకండి. మీ విధులను, బాధ్యతలను సకాలంలో నెరవేర్చడం ద్వారా మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. అలాగే ఒక మనిషి చేసే దాన ధర్మాలు ఒక వ్యక్తి పాప పుణ్యాలను నిర్ణయిస్తాయి. అతని జీవితాన్ని అందంగా మార్చే పనిని కూడా చేస్తాయి.

గ్రంధాలలో దాన ధర్మం ప్రాముఖ్యతను వివరిస్తూ సంపాదనలో కొంత భాగాన్ని దాతృత్వానికి ఖర్చు చేయాలని చెప్పాడు ఆచార్య చాణక్య. అలాగే ఎప్పుడు ధనవంతులు కావడానికి లేదా వృద్ధాప్యంలో దానధర్మాలు చేయడానికి వెయిట్‌ చేయకూడదు.అలాగే జీవితంలో భాగమై ఎప్పటికప్పుడు తన సంపదను సద్వినియోగం చేసుకోవాలి. కాకుండా మీ మనస్సులో ఏదైనా ముఖ్యమైన పని చేయాలని మీరు అనుకుంటే దానిని రేపటికి వాయిదా వేయవద్దని ఆచార్య తెలిపారు. రేపటికి గ్యారెంటీ లేనందున వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కానీ చెడు ఆలోచన వస్తే దానిని నివారించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించడి అని ఆచార్య చాణక్య తెలిపారు.