Chanakya Niti : వేల ఏళ్ల క్రితం చాణక్యుడు చెప్పిన నీతిసూత్రాలు ఎవర్ గ్రీన్. నేటికీ వాటిని పాటించి చాలామంది జీవితాల్లో సక్సెస్ అవుతున్నారు. భార్యాభర్తల మధ్య అనుబంధం గురించి, దాంపత్య జీవితం గురించి చాణక్య నీతిలో స్పష్టంగా వివరించారు. భర్త, భార్యతో ఎలా ఉండాలి ? భార్య, భర్తతో ఎలా ఉండాలి? ఏయే విషయాలు ఇద్దరూ చెప్పుకోవచ్చు ? ఏయే విషయాలు ఇద్దరూ చెప్పుకోవద్దు ? అనే టిప్స్ కూడా చాణక్యుడు(Chanakya Niti) చెప్పాడు. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
- చాలామంది భర్తలు తమ భార్యను తిడుతుంటారు. అలా తిట్టకూడదని చాణక్యుడు చెబుతాడు. భార్యను తిట్టే పురుషులు జీవితంలో విజయం సాధించలేరని ఆయన అంటారు. భార్యను తిట్టే పురుషులు.. తమ ఇంటి పెద్దలను కూడా గౌరవించరని చాణక్యుడు తెలిపారు.
- భార్యలు అణకువగా ఉండాలని చాణక్యుడు అంటారు. భర్తను తప్పకుండా భార్యలు గౌరవించాలని ఆయన చెబుతారు. స్త్రీలు తమ భర్త పాదాలను తాకాలని చాణక్యుడు సూచిస్తున్నారు. భర్త పాదాలను భార్య తాకితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఆయన అంటారు.
- ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత, సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత భర్త పాదాలకు భార్య నమస్కరించాలని చాణక్యుడు సూచిస్తున్నారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుందని ఆయన అంటారు.
- ఎవరైనా వ్యక్తి పరస్త్రీపై వ్యామోహాన్ని పెంచుకుంటే లక్ష్మీదేవి అసహ్యించుకుంటుందని చాణక్యుడు అంటారు. అతడికి సంపదలు దూరం అవుతాయని చెబుతారు.
- సోమరితనం కలిగిన వ్యక్తుల ఇళ్లలో సంపద నిలువదని చాణక్యుడు అంటారు. శ్రమించే తత్వాన్నికొనసాగించే వారిపై లక్ష్మీదేవి కరుణ ఉంటుందని ఆయన చెబుతారు.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.