Chanakya Niti: తల్లితండ్రులకు ఈ లక్షణాలుంటే పిల్లలకు శత్రువుల అవ్వడం ఖాయం!

ఆచార్య చాణక్య భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాలను ముందుగానే అంచనా వేసి తన గ్రంథంలో వ్రాసుకొచ్చిన

  • Written By:
  • Publish Date - August 17, 2022 / 01:22 PM IST

ఆచార్య చాణక్య భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాలను ముందుగానే అంచనా వేసి తన గ్రంథంలో వ్రాసుకొచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆచార్య చాణక్య పొందుపరిచిన ఎన్నో విషయాలు జీవితంలో నిజమయ్యాయి. అయితే నీ పిల్లలకైనా మొదటి విద్య తన తల్లిదండ్రుల నుంచే ప్రారంభం అవుతుంది అంటున్నాడు ఆచార్య చాణక్య. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం వారి జీవితాంతం పాటు సాగుతుందని తెలిపారు. అంతేకాకుండా పిల్లల వ్యక్తిత్వం ఏర్పడుతుందని అందువల్ల పిల్లల విద్యా విలువలపై తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధను వహించాలి అని పేర్కొన్నారు. ఇదే పిల్లలు సరైన మార్గంలో వెళితే పిల్లలు బాధ్యతలను విధులను సక్రమంగా నిర్వర్తించడంతోపాటు తల్లిదండ్రులు గర్వపడే విధంగా చేస్తారు అని తెలిపాడు ఆచార్య చాణక్య.

అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసే తప్పులు పిల్లల భవిష్యత్తును పాడు చేయడంతో పాటు అటువంటి తల్లిదండ్రులను పిల్లలకు శత్రువులుగా ఆచార్య చాణక్యుడు భావించాడు. తల్లిదండ్రులు, వారి పిల్లలను ఎప్పుడూ మంచి వారిగా పెంచాలని మంచి బుద్ధులు సత్ప్రవర్తనతో నడుచుకునే విధంగా తీర్చిదిద్దాలి అని ఆచార్య తెలిపారు. అటువంటి పిల్లలు తల్లిదండ్రుల గౌరవం అలాగే ఇంటి పేరును కూడా ప్రకాశింపజేస్తారని తెలిపారు. అదేవిధంగా పిల్లల మనసులో ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచనలు వచ్చే విధంగా చేయవద్దని, అలాగే తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చడం కోసం పిల్లలపై ఒత్తిడిని తీసుకురావద్దు అని ఆచార్య చాణక్య తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలలో మంచి లక్షణాలను పెంపొందిస్తే, రేపటి రోజున ఆ పిల్లలు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా చేస్తారని ఆచార్య చాణక్య తెలిపారు.

పిల్లల చదువును సీరియస్‌గా తీసుకోని తల్లిదండ్రులు, చదువుపై శ్రద్ధ పెట్టని తల్లిదండ్రులు బిడ్డకు శత్రువులాంటి వారని, నిరక్షరాస్యులైన పిల్లలు భవిష్యత్తులో నాగరిక సమాజంచే తృణీకరించబడతారని తెలిపాడు ఆచార్య చాణక్య. అలాంటి పరిస్థితుల్లో పిల్లల్లో విశ్వాసం కూడా సన్నగిల్లుతుందని అంతేకాకుండా చదువు లేని పిల్లలు స్థానం హంసల మందలో కొంగ వంటిదని పేర్కొన్నాడు ఆచార్య చాణక్య.