Chanakya Niti: ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఈ నాలుగు విషయాలు తెలుసుకోండి?

ఆచార్య చాణక్య చెప్పిన ఎన్నో విషయాలు జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి దోహదపడుతూ ఉంటాయి. అంతేకాకుండా

  • Written By:
  • Publish Date - August 18, 2022 / 05:45 AM IST

ఆచార్య చాణక్య చెప్పిన ఎన్నో విషయాలు జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి దోహదపడుతూ ఉంటాయి. అంతేకాకుండా నీటికి చాలా మంది ఆచార్య చాణక్య నీతి శాస్త్రంలో బోధించిన ఎన్నో విషయాలను అనుసరిస్తూ ఉంటారు. అయితే ఆచార్య చాణక్య తన గ్రంథంలో కొందరి వ్యక్తులకు దూరంగా ఉండాలి అని పేర్కొన్నారు. అదే విధంగా కోపంలో ఉన్న వ్యక్తికి మరింత కోపం తగ్గించేలా చేయాలి కానీ ఆ కోపాన్ని మరింత పెరిగేలా చేయకూడదు. అలా చేయడం వల్ల ఆ వ్యక్తికీ మరింత కోపం పెరుగుతుంది.

తన సమతుల్యతను కోల్పోయి తనతో పాటు ఇతరుల కూడా హాని కలిగించే నిర్ణయాలను తీసుకుంటారు.
ఆనందానికి ఆధారం మతం. మతానికి ఆధారం సంపద. అర్థానికి ఆధారం స్థితి అటువంటి స్థితికి ఆధారం ఇంద్రియాలను జయించడమే. అలాగే ఎప్పుడు అబద్ధాలు చెప్పే వ్యక్తి,ఏదో ఒక రోజు తప్పకుండా తన అబద్ధాల వలలో తానే చిక్కుకుంటాడు. అయితే అతని అబద్ధం పట్టుబడిప్పుడు అతను ఇతరుల నమ్మకాన్ని కోల్పోవడమే మాత్రమే కాకుండా అతని గౌరవం కూడా కోల్పోతాడు.

కాబట్టి ఎప్పుడు కూడా అపద్దాలు చెప్పకూడదు. అలాగే ఇప్పుడు కూడా నిజాలే చెప్పాలి. పాలకుడు సమర్థులైన పరిపాలకుల సహాయంతో పాలించాలి. కష్టకాలంలో, రాజు స్వయంగా అన్ని నిర్ణయాలు తీసుకోలేడు. ఆ సమయంలో అర్హత కలిగిన సహాయకులు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోవడంలో ఆ రాజుకు సహాయపడతారు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.