Site icon HashtagU Telugu

Chanakya Neeti: విజయం సాదించాలంటే ఈ అలవాట్లు అస్సలు ఉండకూడదు!

Chanakya Niti

Chanakya Niti

జీవితంలో అనుకున్నది సాధించాలి అంటే జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను అనుభవించాలి. అప్పుడే మనం అనుకున్న విధంగా విజయాన్ని సాధించగలం. అయితే మన జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగించాలి అంటే ఎటువంటి జీవిత సూత్రాలు పాటించాలి అన్నది ఆచార్య చాణక్యుడు తెలిపారు. అయితే ఒకవేళ ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు మనకు కష్టంగా ఉన్నా కూడా అవే మనల్ని క పరిస్థితుల నుంచి బయటపడేలా చేస్తాయి. చాణక్య నీతిశాస్త్రం ప్రకారం ఈ అలవాట్లు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా జీవితంలో విజయం సాధించలేడని పేర్కొంది. మరి ఇటువంటి అలవాట్లను వదిలేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సోమరితనం: సోమరితనం.. ఇది ప్రతి ఒక్క జీవితంలో అతిపెద్ద అడ్డంకిగా మారుతుంది. సోమరితనం వల్ల ఎలప్పుడూ తమ పనిని వాయిదా వేస్తున్నవారు ఎప్పటికీ విజయం సాధించలేరు. విజయం సాధించాలంటే ప్రతీ ఒక్కరూ కష్టపడాలి.

ఇబ్బందులతో భయపడకండి: అయితే ఒక పనిని చేసేటప్పుడు దానిని పూర్తి చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు చూసి భయపడకూడదు అని ఆచార్య చాణక్య తెలిపారు. అయితే అలా కష్టాలను చూసే భయపడే వ్యక్తి విజయాలను ఆలస్యంగా ఆస్వాదించాల్సి ఉంటుందట.

సమయం వృధా చేయవద్దు: ఆచార్య జాగ్రత్తగా చెప్పిన సూత్రాలలో అన్నింటికంటే ముఖ్యమైనది ఇది అని చెప్పవచ్చు. ఇప్పుడు కూడా ఎవరు సమయాన్ని వృధా చేయకూడదు. అసలు సమయం గురించి పట్టించుకోని వారి విజయాన్ని సాధించలేరు. ఎల్లప్పుడూ ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవాలి. మీ తప్పులపై దృష్టి పెట్టి వాటిని సరి చేసుకోవాలి.

చెడు సావాసాలకు దూరంగా ఉండండి: చాణక్య నీతి ప్రకారం సాధారణంగా ఒక వ్యక్తి చేసే పనులపై తన స్నేహితుల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కాబట్టి స్నేహం చేసేటప్పుడు కొంచెం ఆలోచించి తప్పుడు సావాసాలు చెడు అలవాటులో ఉన్న వారితో అసలు సావాసం చేయకూడదు. తప్పుడు వ్యక్తులు మిమ్మల్ని మీ లక్ష్యాల నుంచి దూరం చేస్తారు.