Site icon HashtagU Telugu

Chalimidi: వేసవిలో చలువ చేసే చలిమిడి.. టేస్టీగా పిల్లలకు చేసి పెట్టండిలా?

Mixcollage 29 Feb 2024 08 48 Am 4483

Mixcollage 29 Feb 2024 08 48 Am 4483

చలిమిడి.. దీనికి తెలుగింటి పెళ్లిళ్లలో ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. పెళ్లికూతురు వెంట చలిమిడి బిందె కూడా వెళ్లాల్సిందే. ఆ చలిమిడిని పంచడం వల్ల జంటకు ఎంతో మేలు జరుగుతుందని అంటారు. అయితే ఈ చలిమిడిని కేవలం పండుగ సందర్భాలలో విశేషమైన సందర్భాలలో మాత్రమే కాకుండా చాలా మంది అప్పుడప్పుడు కూడా తినడానికి చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి ఈ రెసిపీ ని పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో తెలియదు. మరి ముఖ్యంగా ఈ చలిమిడి వేసవిలో ఎంతో బాగా ఉపయోగపడడంతో పాటు శరీరానికి చలువ చేస్తుంది. మరి ఈ చలిమిడి రెసిపీని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

బియ్యం – రెండు గ్లాసులు
బెల్లం – ముప్పావు కప్పు
పచ్చి కొబ్బరి ముక్కలు – అరకప్పు
జీడిపప్పులు – గుప్పెడు
యాలకుల పొడి – అర స్పూను
నెయ్యి – రెండు స్పూన్లు

తయారీ విధానం :

చలిమిడిని నేరుగా బియ్యం పిండిని కొని తయారు చేసుకోవచ్చు. బియ్యంతో తయారు చేసుకున్న మంచిదే. ఒకవేళ బియ్యంతో తయారు చేసుకుంటే ముందుగా బియ్యాన్ని 6 గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత బియ్యాన్ని వడకట్టి కాటన్ వస్త్రంలో నీరంతా పోయేవరకు ఉంచాలి. ఆ తడి బియ్యాన్ని మిక్సీలో వేసి పిండిలా చేసుకోవాలి. జల్లెడతో జల్లించి మెత్తని పిండిని వేరు చేయాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక పచ్చి కొబ్బరి ముక్కలు, జీడి పప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో బెల్లాన్ని బాగా తురిమాలి. ఆ తురుము మునిగే వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. బెల్లం తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు అందులో యాలకుల పొడి. కొబ్బరి ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని అందులో కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి పిండిని వేస్తే ఉండలు కట్టే అవకాశం ఉంది. కాబట్టి ఒకరు కలుపుతూ ఉంటే మరొకరు పిండిని వేస్తూ ఉండాలి. ఇలా చలిమిడి గట్టిగా తయారయ్యే వరకు పిండిని వేసి బాగా కలపాలి. దీన్ని గాలి, తడి తగలననివ్వకుండా నిల్వ చేసుకోవాలి.

Exit mobile version