Site icon HashtagU Telugu

Cauliflower Tomato Palakura: కాలీఫ్లవర్ టమాటా పాలకూర కర్రీ.. సింపుల్ గా ట్రై చేయండిలా?

Mixcollage 21 Dec 2023 04 56 Pm 9599

Mixcollage 21 Dec 2023 04 56 Pm 9599

మామూలుగా మనం కాలీఫ్లవర్, టమోటా అలాగే పాలకూర తో ఎన్నో రకాల రెసిపీలను తినే ఉంటాం. అయితే ఈ మూడింటి కాంబినేషన్ లో తయారైన కర్రీని ఎప్పుడైనా తిన్నారా. ఒకవేళ తినకపోతే కాలీఫ్లవర్ టమోటా పాలకూర కర్రీని ఇంట్లోనే సింపుల్ గా ఏ విధంగా చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం

కాలీఫ్లవర్ టమాటా పాలకూర కర్రీకి కావలసిన పదార్ధాలు:

కాలీఫ్లవర్ మొగ్గలు – 1 కప్పు
టమాటా – 1/2 కప్పు
పాలకూర కట్టలు – 2
ఉల్లి ముక్కలు – 1/4 కప్పు
పచ్చిమిరపముక్కలు – 4
ఆమ్ చూర్ – 1/4 చెంచా
ధనియాల పొడి – 1/4 చెంచా
గరం మసాలా – 1/4 చెంచా
కారం – 1/4 చెంచా
జీలకర్ర – కొద్దిగా
పసుపు – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి సరిపడినంత

కాలీఫ్లవర్ టమాటా పాలకూర కర్రీ తయారీ విధానం:​

ముందుగా కాలీ ఫ్లవర్ మొగ్గలుగా తరుగుకొని కొద్ది పాలు కలిపిన నీళ్ళలో ఉడికించి వడగట్టి ప్రక్కన పెట్టుకోవాలి. అలా చేస్తే మొగ్గలు తెల్లగా ఉంటాయి.
తర్వాత బాణలిలో నూనె వేసి వేడి చేసి కాస్త దంచిన వెల్లుల్లి జీలకర్ర వేయించి ఒక్కొక్కటిగా ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి, టమాటా వేసి వేయించుకోవాలి. ఈ ముక్కలు దోరగా వేగుతున్నప్పుడు ఉప్పు, కారం, గరం మసాల, ఆమ్ చూర్ పొడి వేసి కాలీఫ్లవర్ మొగ్గలు వేసి బాగా కలిపి సన్నగా తరిగిన పాలకూర ఆకులు వేసి మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించి దింపుకోవాలి. అంతే కాలీఫ్లవర్ టమాటా పాలకూర కర్రీ రెడీ.