Carrot Sweet Corn Omelette: ఎప్పుడైన క్యారెట్ స్వీట్ కార్న్ ఆమ్లెట్ తిన్నారా.. అయితే ట్రై చేయండిలా?

మామూలుగా వర్షం పడుతుంది అంటే ఏదైనా వేడి వేడిగా తినాలని అనుకుంటూ ఉంటారు.. ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ వంటలు కాకుండా అప్పుడప్పుడు కాస్త వెరైటీగ

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 08:00 PM IST

మామూలుగా వర్షం పడుతుంది అంటే ఏదైనా వేడి వేడిగా తినాలని అనుకుంటూ ఉంటారు.. ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ వంటలు కాకుండా అప్పుడప్పుడు కాస్త వెరైటీగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. వర్షం పడే సమయంలో చాలామంది కాల్చిన మొక్కజొన్న లేదంటే ఉడకబెట్టిన మొక్కజొన్నలను తింటూ ఉంటారు. ఇంకొందరు బయటకు వెళ్లి అలా స్వీట్ కార్న్ లేదంటే హాట్ కార్న్ తింటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా కేరట్ స్వీట్ కార్న్ ఆమ్లెట్ ట్రై చేశారా. మరి ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కేరట్ స్వీట్ కార్న్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు:

కేరట్ – 2
స్వీట్ కార్న్ – 50 గ్రా
గుడ్లు – 2
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 5
కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు, నూనే – తగినంత

కేరట్ స్వీట్ కార్న్ ఆమ్లెట్ తయారి విధానం:

ముందుగా స్వీట్ కార్న్ ని ఉడికించి ఉంచుకోవాలి. కేరట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈ మూడింటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనే వేసి కాగాకా ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. అందులో కేరట్ తురుము కూడా కలిపి 2 నిమిషాల తరువాత ఉప్పు కొత్తిమీర తరుగు వేసి చివరిగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ ని వేసి అంతా బాగా కలిపి దించెయ్యాలి. ఇప్పుడొక గిన్నెలో గుడ్లు పగలకొట్టి స్పూన్ తో బాగా గిలకొట్టాలి. స్టవ్ మీద పెనం పెట్టి ఆమ్లెట్ వేసి కాస్త కాలిన తర్వాత దాని మీద మనం ముందుగా సిద్దం చేసుకున్న కేరట్ , స్వీట్ కార్న్ మిశ్రమాన్ని వేసి పూర్తిగా కాలాకా రెండో వైపు తిప్పకుండా తీసెయ్యాలి. ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే వేడి వేడి కేరట్ స్వీట్ కార్న్ ఆమ్లెట్ రెడీ.