Carrot Milk Shake : క్యారెట్ మిల్క్ షేక్.. పక్కా కొలతలతో ఇలా చేయండి..

ఇంట్లోనే హెల్దీగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ ను తయారు చేసుకోవచ్చు. తీపి కోసం పంచదార శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. పంచదార వేయకుండానే ఈ మిల్క్ షేక్ ను తయారు చేసుకోండి..

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 09:10 PM IST

Carrot Milk Shake : మండువేసవిలో కూల్ కూల్ గా ఏదొకటి తాగాలనిపిస్తుంటుంది. బయట దొరికే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ బాగా అలవాటు పడిపోయారు. వాటివల్ల ఆరోగ్యానికి చెడు జరుగుతుందే గానీ.. మంచి ఏమీ ఉండదు. ఇంట్లోనే హెల్దీగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ ను తయారు చేసుకోవచ్చు. తీపి కోసం పంచదార శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. పంచదార వేయకుండానే ఈ మిల్క్ షేక్ ను తయారు చేసుకోండి..

క్యారెట్ మిల్క్ షేక్ కు కావలసిన పదార్థాలు

క్యారెట్ తరుగు – 3/4 కప్పు

యాలకుల పొడి – చిటికెడు

పాలు – 1 కప్పు

బాదం తరుగు – 3 స్పూన్లు

కోవా – 2 స్పూన్లు

హార్లిక్స్ పౌడర్ – 1 స్పూన్

క్యారెట్ మిల్క్ షేక్ తయారీ విధానం

ముందుగా క్యారెట్ ను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. బాదం పప్పుల్ని 4 గంటల పాటు నానబెట్టి.. పైన ఉన్న తొక్కను తీసేయాలి.

ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి పాలు పోయాలి. అవి బాగా మరిగిన తర్వాత.. బాదం తరుగు, క్యారెట్ తరుగు, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇందులోనే కోవా వేసుకుని.. కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు పైన యాలకుల పొడిని చల్లుకుని.. మిశ్రమాన్నంతటినీ ఒక గ్లాసులో వేసుకోవాలి. పైన హార్లిక్ పొడి వేసుకుని సర్వ్ చేసుకుంటే.. టేస్టీ మిల్క్ షేక్ రెడీ.

ఈ మిల్క్ షేక్ లో క్యారెట్లు ఉన్నాయి కాబట్టి.. ఆరోగ్యానికి ఎంతో మేలు. పాలు, క్యారెట్, కోవా అన్నీ.. శరీరానికి పోషకాలను అందిస్తాయి. క్యారెట్లలో విటమిన్ కె, విటమిన్ బీ6, పొటాషియం, బయోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. బీపీని తగ్గిస్తాయి. కంటిచూపుకు కూడా క్యారెట్లు చాలా మంచిది.