Site icon HashtagU Telugu

Carrot Milk Cream Sweet: పిల్లలు ఎంతో ఇష్టపడే క్యారెట్ క్రీమ్‌మిల్క్ స్వీట్.. ఇలా చేస్తే కొంచెం కూడ మిగలదు?

Mixcollage 24 Dec 2023 05 22 Pm 6930

Mixcollage 24 Dec 2023 05 22 Pm 6930

మామూలుగా పిల్లలు ఎక్కువగా స్వీట్ రెసిపీలను ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా చాక్లెట్ రెసిపీస్ కేక్ రెసిపీస్ ని తెగ ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో క్యారెట్ క్రీం మిల్క్ స్వీట్ కూడా ఒకటి. ఈ రెసిపీని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చాలామంది మహిళలు పిల్లలకు ఈ రెసిపీని చేసి పెట్టాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఏది ఎంత మోతాదులో తీసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈ రెసిపీ ని ఇంట్లో సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

క్యారెట్ క్రీమ్‌మిల్క్ స్వీట్ కీ కావలసిన పదార్థాలు:

క్యారెట్ తురుము – 2 కప్పులు
మిల్క్ క్రీమ్ – 2 కప్పులు
క్రీమ్ – 2 కప్పులు
పాలపొడి – 1 కప్పు
పంచదార – అరకప్పు
వెనీలా ఎసెన్స్ – కొద్దిగా
బూడిదగుమ్మడి తురుము – ఒక కప్పు

క్యారెట్ క్రీమ్‌మిల్క్ స్వీట్ తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని పాలపొడి, వెనీలా ఎసెన్స్,క్రీమ్‌మిల్క్, క్రీమ్ వేసి బాగా కలిపి డీప్‌ఫ్రిజ్‌లో పెట్టిలి అది పూర్తిగా గట్టిగా అయ్యేవరకు ఉంచాలి. తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి బూడిద గుమ్మడి ,క్యారెట్ తురుములను వేసి కొంచం పచ్చి వాసనా పోయేవరకు వేయించి తరువాత పంచదారతో కలిపి ఉడికించి చల్లార్చాలి.
ఇప్పుడు ప్లేట్ తీసుకుని ఫ్రిజ్ లో పెట్టిన మిశ్రమాన్ని ఒక లేయర్ లా వేసి తరువతా క్యారెట్ మిశ్రమాన్ని వేసి మళ్ళి పైన సేమ్ రిపీట్ చెయ్యాలి. అంతే క్యారెట్ క్రీమ్‌మిల్క్ స్వీట్ రెడీ..