Pimples: మొటిమలు శాశ్వతంగా దూరంగా కావాలా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే?

అమ్మాయిలకు అబ్బాయిలకు కాస్త వయసు రాగానే మొటిమల సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కొంతమందికి ముఖం నిండా మొటిమలతో ముఖం చాలా అందవిహీనంగా కనిపి

  • Written By:
  • Publish Date - June 27, 2023 / 10:00 PM IST

అమ్మాయిలకు అబ్బాయిలకు కాస్త వయసు రాగానే మొటిమల సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కొంతమందికి ముఖం నిండా మొటిమలతో ముఖం చాలా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కేవలం అమ్మాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు కూడా అందం విషయంలో ఎన్నో జాగ్రత్తలు వహిస్తున్నారు. అయితే మనకు మొటిమలు ఎక్కువగా కాలుష్యం, శరీరంలో వేడి, అధిక సెబమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడదల కావడం, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపాలు, జన్యుపరమైన సమస్యలు వంటి కారణాల వల్ల వస్తూ ఉంటాయి. మొటిమల కారణంగా నొప్పి, వాపు కూడా బాధపెడుతూ ఉంటాయి. మొటిమలు, మొటిమల కారణంగా వచ్చే మచ్చలు, గుంతలు మన ముఖాన్ని అందవీహీనంగా మారుస్తాయి.

అయితే మొటిమల సమస్యను శాశ్వతంగా దూరం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మరి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతి రోజు సరిపడా నీళ్లు తాగితే. శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. మనం నీరు ఎక్కువగా తాగితే శరీరంలోని పేగులు, ఇతర అవయవాలు శుభ్రపడతాయి. అదేవిధంగా, చర్మంలోని మురికి, కాలుష్యం, టాక్సిన్స్‌ క్లీన్‌ అవుతాయి. దీంతో, పింపుల్స్‌ సమస్య పరిష్కారం అవుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా, ప్రకాశవంతంగా మారుతుంది. కాబట్టి రోజుకు కనీసం ఏడెనిమిది గ్లాసుల నీరు తాగాలి. మీ డైట్‌లోను సూప్‌లు, జ్యూస్‌లు వంటి ద్రవపదార్తాలు ఎక్కువగా చేర్చుకోవడం మంచిది.

మీ చర్మాన్ని క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయడం మర్చిపోవద్దు. ఎక్స్‌ఫోలియేషన్‌ వల్ల చర్మ రంధ్రాల లోపల పేరుకున్న వ్యర్థాలు, కాలుష్య కారకాలను బయటకు పంపవచ్చు. మొటిమలు, నల్ల మచ్చలు వంటి చర్మ సమస్యలను నివారించవచ్చు. ఎక్స్‌ఫోలియేషన్‌ చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. కొత్త చర్మ కణాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. మీ చర్మం తాజాగా, మెరుస్తూ ఉండటానికి కనీసం వారానికి ఒకసారైనాన్యాచురల్‌ స్క్రబ్‌తో చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయండి. ఇది మొటిమలతో పాటు ఇతర చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే మీ అందాన్ని రెట్టింపు చేయడానికి, మొటిమల సమస్యను నివారించడానికి మీరు తీసుకునే డైట్‌ సహాయపడుతుంది. మీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్‌ ఎక్కువగా తీసుకోండి.

నట్స్‌లో యాంటీ ఏజింగ్‌ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎ, ఇ, విటమిన్లు, ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. మన ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. నిద్ర చక్రంలో ఆటంకం ఏర్పడితే.. మన శరీర విధులు, కదలికలపై ప్రభావం పడుతుంది. రోజుకు కనీసం ఏడెనిమిది గంటల నిద్ర తప్పనిసరి. నిద్రలేమి విపరీతమైన ఒత్తిడి, ఆందోళనతోపాటు ఇతర సమస్యలకూ దారి తీస్తుంది. ఒత్తిడి పెరిగినప్పుడు సహజంగానే.. మొటిమలు రావడం స్టార్ట్‌ అవుతాయి. నిద్ర సరిగ్గా లేకపోతే త్వరగా వృద్ధాప్య ఛాయలు రావడం, కళ్లకింద వాపులు వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. అలాగే ప్రతిరోజూ చర్మానికి సన్‌స్క్రీన్ లోషన్‌లను అప్లై చేయడం స్కిన్‌కేర్‌ రొటీన్‌లో భాగం చేసుకోవాలి. సన్‌ స్క్రీన్‌ బయటకు వెళ్లేప్పుడు కాలుష్యం, యూవీ కిరణాల కారణంగా ఎదురయ్యే చర్మ సమస్యలను దూరం చేస్తుంది. .