Site icon HashtagU Telugu

Capsicum Rings: హోటల్ స్టైల్ క్యాపికమ్ రింగ్స్ ఇంట్లోనే తయారు చేసుకోండిలా?

Mixcollage 20 Mar 2024 07 49 Pm 9109

Mixcollage 20 Mar 2024 07 49 Pm 9109

మనకు బయట ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఎక్కువగా కాప్సికం రింగ్స్ లభిస్తూ ఉంటాయి. చాలామంది వీటిని ఇంట్లో ట్రై చేయాలని అనుకున్నప్పటికీ, ఇలా ట్రై చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా క్యాప్సికం రింగ్స్ ని ఇంట్లోనే ట్రై చేయాలని అనుకుంటున్నారా. మరి ఈ రెసిపీ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏమేం కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

క్యాప్సికమ్ – నాలుగు
బియ్యప్పిండి – పావు కప్పు
శెనగపిండి – ఒక కప్పు
బేకింగ్ సోడా – చిటికెడు
అల్లంవెల్లుల్లి పేస్టు – పావు టీస్పూను
నీళ్లు – కలపడానికి సరిపడా
కారం – ఒక స్పూను
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం :

క్యాప్సికమ్ చిన్న పరిమాణంలో ఉన్నవి ఎంచుకోవాలి. అప్పుడే వాటిని అడ్డంగా కోస్తే చక్రాల్లా వస్తాయి. తర్వాత ఒక గిన్నె తీసుకుని శెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, బేకింగ్ సోడా కూడా వేయాలి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అందులో వేయాలి. కడాయిలో నూనె బాగా వేడెక్కాక క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకుని వేయించాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సీకమ్ రెడీ.

Exit mobile version