Capsicum Paneer Curry: క్యాప్సికం పన్నీర్ కర్రీ.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా?

మామూలుగా మనం క్యాప్సికం తో తయారు చేసే ఎన్నో రకాల వంటకాలు తినే ఉంటాం. క్యాప్సికం వడలు, క్యాప్సికం ఫ్రై, క్యాప్సికం మసాలా కర్రీ క్యాప్సికం ఎగ

  • Written By:
  • Publish Date - December 9, 2023 / 10:00 PM IST

మామూలుగా మనం క్యాప్సికం తో తయారు చేసే ఎన్నో రకాల వంటకాలు తినే ఉంటాం. క్యాప్సికం వడలు, క్యాప్సికం ఫ్రై, క్యాప్సికం మసాలా కర్రీ క్యాప్సికం ఎగ్ ఫ్రై ఇలా ఎన్నో రకాల వంటకాలు తినే ఉంటాం. కానీ ఎప్పుడైనా క్యాప్సికం పన్నీర్ కర్రీ తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

క్యాప్సికం పన్నీర్ కర్రీకి కావలసిన పదార్థాలు:

క్యాప్సికం – అరకేజి
పన్నీర్ – పావుకేజీ
యాలకులు – మూడు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
జీలకర్ర – 1 స్పూన్
కారం – 2 స్పూన్లు
ధనియాల పొడి – ఒకటిన్నర స్పూన్లు
ఉల్లిపాయలు – ఐదు
అల్లం వెల్లుల్లి ముద్ద – 2 స్పూన్లు
పసుపు – కొద్దిగా
చింతపండు – కొద్దిగా
లవంగాలు – నాలుగు
నూనె – సరిపడా
ఉప్పు – తగినంత
వేరుశనగ పప్పు – ఒక కప్పు
కొత్తిమీర – కొంచం
పుదీనా – కొంచం
కరివేపాకు – కొద్దిగా
తెల్ల నువ్వులు – 2 స్పూన్లు

క్యాప్సికం పన్నీర్ కర్రీ తయారీ విధానం:

ముందుగా ఉల్లిపాయలు, క్యాప్సికం కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేరుశనగ పప్పులు, నువ్వులు వేసి వేయించి పక్కన పెట్టుకుని అందులోనే నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను, పన్నీర్‌ను విడివిడిగా వేయించుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తెల్ల నువ్వులు, వేరుశనగ పప్పులు, చింతపండు, పుదీనా, కరివేపాకు, ఉప్పును మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ , యాలకులు, లవంగాలు, వేయాలి.తర్వాత క్యాప్సికం ముక్కలు, మసాలా పేస్ట్, కొద్దిగా నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ధనియాల పొడి, కారం వేసి పది నిమిషాలు ఉడికించాలి. చివరలో పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటే క్యాప్సికం పన్నీర్ కర్రీ రెడీ.