Site icon HashtagU Telugu

Capsicum Egg Fried Rice: డాబా స్టైల్ క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్.. తయారీ విధానం?

Capsicum Egg Fried Rice

Capsicum Egg Fried Rice

ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బయట ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడ్డారు. ఎగ్ రైస్,ఫ్రైడ్ రైస్,జీరా రైస్, టమోటా రైస్ అంటూ స్ట్రీట్ ఫుడ్ కి బాగా అలవాటు పడ్డారు. అయితే మామూలుగా ఎగ్ రైస్ తినడం అన్నది కామన్. మరి అందులో కాస్త డిఫరెంట్ గా క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా తిన్నారా. ఒకవేళ తినకపోతే ఎలా తయారు చేసుకోవాలి అందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్ కావలసిన పదార్థాలు:

అన్నం – కొద్దిగా
కాప్సికం -రెండు
ఎగ్స్ – రెండు
ఉల్లిపాయలు – మూడు
సోయా సాస్ – రెండు స్పూన్లు
మిరియాల పొడి – కొద్దిగా
ఉప్పు, నూనె – తగినంత

కాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం:

ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నూనె పోసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక సన్నగా తరిగిన కాప్సికం ముక్కలని కూడా వేయాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో గుడ్లు గిలకొట్టుకోవాలి. తర్వాత ఈ గుడ్డు మిశ్రమాన్ని ఉల్లిపాయ ముక్కల మీద పల్చగా ఆమ్లెట్ లాగా వెయ్యాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడిని చల్లుకోవాలి. ఒక వైపు వేగాక గరిటతో బాగా కలియపెట్టి ఆమ్లెట్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఉడికించి చల్లార్చిన అన్నాన్ని కలిపి, సోయాసాస్ వేసి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి చల్లుకుంటే సరి ఎంతో టేస్టీగా ఉండే కాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.

Exit mobile version