Egg Alternatives : గుడ్డుకు ఆల్టర్నేటివ్ ఈ ఫుడ్స్

Egg Alternatives : గుడ్లలో చాలా పోషక విలువలు ఉంటాయి. వాటిని తింటే ఆరోగ్యానికి మంచిది.

  • Written By:
  • Updated On - November 27, 2023 / 07:59 PM IST

Egg Alternatives : గుడ్లలో చాలా పోషక విలువలు ఉంటాయి. వాటిని తింటే ఆరోగ్యానికి మంచిది. కానీ కొందరికి గుడ్లు పడవు. వాటిని తినడానికి పలువురు ఇష్టపడరు. అలాంటి వారు ఏం చేయాలి ? గుడ్లతో సమానంగా పోషకాలను అందించే ఫుడ్స్ ఏమున్నాయి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

  • గుడ్లు తినలేని వారు టోఫు తినొచ్చు. వీటిని మనం కర్రీలా చేసి తినొచ్చు.
  • ఆలివ్ ఆయిల్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని సలాడ్స్, స్టిర్ ఫ్రై, సూప్స్ చేయడానికి వాడొచ్చు.
  • కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే బంగాళాదుంపలు తినొచ్చు. ఇందులో స్టార్చ్‌తో పాటు పోషకాలు ఉంటాయి. బంగాళాదుంపలను నూనెలో ఫ్రై చేయకుండా ఆవిరిపై ఉడికించి, పచ్చిగా, సలాడ్స్‌లా చేసి తినొచ్చు.
  • గుమ్మడికాయలను సలాడ్‌లో వేసుకుని తీసుకోవచ్చు. వీటిని ఉడికించి, గుజ్జలా అయినా ఫ్రై చేసి తినొచ్చు.
  • అరటి పండ్లలో పొటాషియం, విటమిన్ సీ సహా మరికొన్ని విటమిన్లు ఉంటాయి. అరకప్పు అరటి పండు ముక్కలు తింటే గుడ్డుతో సమానమైన పోషకాలు లభిస్తాయి.
  • చియా సీడ్స్‌‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలోని కొవ్వుని కరిగిస్తాయి. ఇతర ఆహారాల నుంచి ప్రోటీన్లను గ్రహించడంలో శరీరానికి హెల్ప్ చేస్తాయి. వీటిలో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా(Egg Alternatives)  ఉంటాయి.

Also Read: Minister Harish Rao : నా వల్ల రైతుబంధు ఆగలేదు – హరీష్ రావు