Johnson’s Baby Powder:జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్ రద్దు..మహా సర్కార్ సంచలన నిర్ణయం..!!

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్ ప్రొడక్టు లైసెన్సును మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది.

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 02:42 PM IST

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్ ప్రొడక్టు లైసెన్సును మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది. ఈ పౌడర్ పిల్లల చర్మంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. జాన్సన్ బేబీ పౌడర్ వల్ల చిన్నారుల చర్మంపై ఇన్ఫెక్షన్ వస్తున్నట్లు ప్రభుత్వ ఏజెన్సీ తెలిపింది. ల్యాబ్ టెస్టింగ్ లో శిశువులకు పౌడర్ నమూనాలు ప్రామాణిక పీహెచ్ విలువకుఅనుగుణంగా లేవని ఓ ప్రకటనలో తెలిపింది. కోల్ కత్తాకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు ఆధారణంగా నిర్ణయం తీసుకుంది. పుణె , నాసిక్ నుంచి పౌడర్ శాంపిళ్లను సేకరించి మహారాష్ట్రలో టెస్ట్ చేశారు.

అనంతరం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం `1940 ప్రకారం జాన్సన్ కంపెనీ ఎఫ్ డీఏ షోకాజ్ నోటిసు జారీ చేసింది. అంతేకాదు మార్కెట్లో ఉన్న స్టాక్ రీకాల చేయాలని కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కంపెనీ ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాల్సిందే.