Site icon HashtagU Telugu

Bamboo Plant : వెదురు మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా..? అదృష్టం కలిసి వస్తుందా..? ఇందులో నిజమెంత?

Can You Grow A Bamboo Plant At Home.. Will Luck Come Together.. How True Is This..

Can You Grow A Bamboo Plant At Home.. Will Luck Come Together.. How True Is This..

Bamboo Plant at Home : చాలామంది ఇంట్లో అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. కొన్ని ఇంటి లోపల పెంచుకుంటే మరికొన్నింటినీ ఇంటి బయట పెంచుకుంటూ ఉంటారు. ఇక ఇంట్లో పెంచుకునే మొక్కలలో వెదురు మొక్క (Bamboo Plant) కూడా ఒకటి.. చాలామంది ఇల్లు ఆఫీసులలో వ్యాపార స్థలాలలో ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటారు. ఇంకొందరు మాత్రం అసలు ఈ మొక్కను పెంచుకోవచ్చా? ఈ మొక్కను పెంచుకుంటే నిజంగానే సంపద పెరుగుతుందా? అదృష్టం కలిసి వస్తుందా అన్న అనుమానాలు కలుగుతూ ఉంటాయి.. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

లక్కీ మొక్కల్లో చిన్న వెదురు మొక్కకు (Bamboo Plant) ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఇంట్లో అందంగా అలంకరించడానికి మాత్రమే కాదు, భాగ్యోదయానికి కూడా కారణం అవుతుంది. అందుకే ఇప్పుడు యువత కూడా చాలా మంది లక్కీ బేంబూను నమ్ముతున్నారు. చాలామంది ఈ మొక్కను చూస్తున్నప్పుడు తమలో పాజిటివ్ ఫీలింగ్ వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ మొక్కను చూడటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. వెదురు మొక్క చిన్నగా కనిపించినా.. దాని ధర ఎక్కువగానే ఉంటుంది. దీని మొక్కలు నర్సరీల్లో 200 నుంచి 2000 రూపాయల ధర వరకు ఉంటాయి. చిన్న వెదురు మొక్కలు మాత్రమే కాదు, మూడు నుంచి నాలుగు అడుగుల పొడవైన మొక్కల వరకు అందుబాటులో ఉన్నాయి.

మరింత అందంగా కనిపించేందుకు గాజు కుండిలో పెట్టుకుంటే మరింత బావుంటుంది. ఈ వెదురు మొక్కను జాగ్రత్తగా కాపాడాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ నీళ్లు అవసరం ఉండదు. నీళ్లు ఎక్కువైతే మొక్క కుళ్లిపోవచ్చు. వాతావరణాన్ని అనుసరించి దీని పోషణలో మార్పులు చేసుకోవాలి. అప్పుడప్పుడు ఎరువు కూడా వెయ్యల్సిన అవసరం ఉంటుంది. నేరుగా సూర్య కాంతి పడకుండా జాగ్రత్త పడాలి. మొక్కలో ఏదైనా భాగం ఎండిపోయినా, కుళ్లిపోయినా ఆ భాగాన్ని తొలగించాలి. వెదురు మొక్కను పంచభూతాలకు ప్రతీకగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉండడం వల్ల సమస్యలు తొలగి పోతాయని నమ్ముతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి అవసరమైన మార్గాలు సుగమం అవుతాయట. మొక్కలోని కాండాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడి పడి ఉంటాయి కనుక కుటుంబంలో ప్రేమాభిమానాలు నిలిచి ఉంటాయని, అనుబంధాలు బలపడతాయని నమ్మకం. అందుకే ఇది ఇంట్లో పెంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు.

Also Read:  Snacks For Winter: చలికాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలనుకుంటే.. ఈ స్నాక్స్ ట్రై చేయండి..!