Spotless Skin: మొటిమల వల్ల వచ్చిన మచ్చలు పోవాలంటే.. ఇలా చేయాల్సిందే?

స్త్రీ పురుషులు చాలామంది మొటిమలు, మొటిమల వల్ల వచ్చే మచ్చలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా మొటిమలు పోయినప్పటికీ వాటి ద్వారా వచ్చే

  • Written By:
  • Publish Date - August 9, 2023 / 09:04 PM IST

స్త్రీ పురుషులు చాలామంది మొటిమలు, మొటిమల వల్ల వచ్చే మచ్చలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా మొటిమలు పోయినప్పటికీ వాటి ద్వారా వచ్చే ఆ నల్లటి మచ్చలు మాత్రం ముఖంపై అలాగే ఉంటాయి. మరి ముఖంపై ఆ నల్లటి మచ్చలు పోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖంపై మొటిమల వల్ల వచ్చే నల్లటి మచ్చలను తొలగించడంలో తులసి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పూర్వకాలం నుంచి తులసి ఆకులను అనేక రకాల చర్మ సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తూనే ఉన్నారు. చర్మ సంరక్షణకి కూడా తులసి బాగా పనిచేస్తుంది. తులసిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమల్ని తగ్గేలా చేస్తాయి.

అదేవిధంగా ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమల వల్ల వచ్చే నొప్పి, వాపుని కూడా దూరం చేస్తాయి. దీంతో మచ్చరహిత చర్మం మీ సొంతం అవుతుంది. అలాగే తులసిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని మొటిమలు, ఎండ వల్ల దెబ్బతిన్న చర్మాన్ని కాపాడుతుంది. దీనిని అనేక రకాలుగా వాడితే చర్మ సమస్యలు తగ్గుతాయి. ఇందుకోసం మొదట తులసి ఆకుల్ని మెత్తని పేస్టులా చేయాలి. అందులో కొద్దిగా పెరుగు వేసి మెత్తగా కలపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, వాటి వల్ల వచ్చిన నల్లటి మచ్చలు దూరమవుతాయి. అలాగే తులసి ఆకులని మెత్తగా గ్రైండ్ చేసి దాని నుంచి రసం తీయాలి. అందులో కాస్త తేనె వేసి బాగా కలపాలి. బైండింగ్ కోసం శనగ పిండి వేసి, పేస్టులా చేసి ముఖానికి అప్లై చేయాలి.

ఆరిన తర్వాత ముఖాన్ని కడుక్కోవడం వల్ల నల్లటి మచ్చలు దూరం అవుతాయి. మరో రెమిడి విషయానికి వస్తే.. తులసి ఆకుల్ని మిక్సీ పట్టి దాని నుంచి రసాన్ని పిండాలి. ఇందులోనే కొద్దిగా అలవేరా జెల్ వేసి బాగా కలిపి ముఖానికి రాయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇంకొక రెమిడీ విషయానికి వస్తే.. వేపాకులు, తులసి ఆకులు సమాన పరిమాణంలో తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా మెత్తగా మిక్సీ పట్టాలి. రసం పిండాలి. ఇందులోనే పసుపు కలపొచ్చు. ఈ పేస్టుని తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత కడగాలి. మూడు రోజుల పాటు ఇలా చేసి చూస్తే మీకే రిజెల్ట్ కనిపిస్తుంది.