Toothpaste: మొటిమలకు టూత్ పేస్ట్ ని ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో యువతను ఎక్కువగా వేధిస్తున్న సమస్య మొటిమలు. ఈ మొటిమల కారణంగా చాలామంది మాస్కులు వేసుకుని తిరుగుతున్నారు అనడంలో ఎటువంటి సంద

  • Written By:
  • Publish Date - July 5, 2023 / 09:30 PM IST

ప్రస్తుత రోజుల్లో యువతను ఎక్కువగా వేధిస్తున్న సమస్య మొటిమలు. ఈ మొటిమల కారణంగా చాలామంది మాస్కులు వేసుకుని తిరుగుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖం నిండా మొటిమలు వచ్చి అంద విహీనంగా కనిపించడంతో పాటు ముఖమంతా కూడా గుంతలు గుంతలుగా ఏర్పడి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాగా మొటిమలను తగ్గించుకోవడానికి బ్యూటీ పార్లర్లకు వెళ్లడంతో పాటు మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే హోమ్ రెమెడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు.

మగువుల దృష్టిలో అందం అంటే చర్మం రంగు, బ్లాక్ హెడ్స్ , మొటిమలు, మచ్చలు, కురులు, గోర్లు ఇలా ఎన్నో విషయాల కోసం ఆలోచిస్తారు. పూర్వంలో మహిళలు మోకానికి చెక్కగా నలుగు పెట్టుకునే వారు. కానీ ఇప్పుడు చర్మం కోసం రకరకాలా క్రీములు, చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అయితే మరి మొటిమలను ఎలా తగ్గించుకోవాలి అందుకోసం ఎటువంటి చిట్కాలను పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిమ్మకాయ రసాన్ని పిగ్మెంటైన్ తగ్గటానికి, నల్లి మొటిమలు తగ్గటానికి రాయమంటారు. అంటే కాదు నిమ్మాయ ముక్కలను నల్లగ ఉన్న చంకలకు లేదా శరీరంలోని ఇతర ప్రాంతాల క్రింద రుద్దడం వలన వాసన ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాను చంపుతుంది.

అలాగే మీకు రోజంతా నిమ్మకాయ తాజా అనుభూతిని కలిగిస్తుంది. మొటిమలకు టూత్ పేస్ట్ చిట్కాను ఇప్పటికి అనేక మంది పాటిస్తూ ఉంటారు. టూత్‌పేస్ట్‌లో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఇది గోడలకు వేసే సున్నం సిమెంట్ ప్లాస్టర్‌లో కూడా ఉంటంది. అయితే మొటిమల పై పేస్ట్ రాస్తే అక్కడ చర్మాన్ని మరింత చికాకుపెడుతుందని తెలిపారు. టూత్‌పేస్ట్‌లో ఉండే పదార్థాలు ఏవీ మొటిమలను తగ్గించవు. టూత్‌పేస్ట్‌ వల్ల అక్కడి చర్మంపై మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని వల్ల మచ్చలు ఏర్పడతాయి.