Pregnancy and Exercise: గర్భిణీ స్త్రీలు వ్యాయామం చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

చాలా మంది గర్భంతో ఉన్న స్త్రీలు చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది గర్భంతో ఉన్నవారు వ్యాయామాలు చేయడానికి భయపడుతూ ఉంటారు. నిజానికి వ్యాయామంతో సుఖ ప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 07:30 AM IST

చాలా మంది గర్భంతో ఉన్న స్త్రీలు చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది గర్భంతో ఉన్నవారు వ్యాయామాలు చేయడానికి భయపడుతూ ఉంటారు. నిజానికి వ్యాయామంతో సుఖ ప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎలాంటి వ్యాయామాలు సురక్షితమో ఇప్పుడు మనం తెలుసుకుందాం..వ్యాయామంతో కండరాలు, ఎముకలు దృఢపడతాయి. అలాగే ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత అవసరానికి మించి బరువు పెరిగే సమస్య తప్పుతుంది. ప్రసవ నొప్పులు కూడా తగ్గుతాయి.

సంబంధించిన ఆరోగ్య సమస్యలు లేనివారు తేలికపాటి వ్యాయామాలు గర్భిణిగా ఉన్న సమయంలోనూ చేయవచ్చు. పొత్తికడుపు మీద ఒత్తిడి పెంచే వ్యాయామాలతో పాటు, పరుగు, గెంతడం లాంటి వ్యాయామాలు చేయకూడదు. అలాగే జంపింగ్‌ జాక్స్‌, స్క్వాట్స్‌, స్కిప్పింగ్‌, ఎక్కువ బరువులతో కూడిన వ్యాయామాలకు దూరంగా ఉండాలి. విపరీతంగా అలసటకు లోను చేసేవి, విపరీతంగా చమటలు పట్టించేవి, ఊపిరి ఆడనంతగా ఒత్తిడికి లోను చేసే వ్యాయామాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

వాకింగ్‌ గర్భిణులకు సురక్షిత వ్యాయామం. తక్కువ తీవ్రతతో కూడిన ఈ వ్యాయామంతో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అయితే వేగం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. జాగింగ్ అన్నది గర్భం దాల్చిన తర్వాత కూడా జాగింగ్‌ చేయవచ్చు. అయితే జాగింగ్‌ వేగం, దూరం మాత్రం తగ్గించుకోవాలి. శరీరం కుదుపులకు గురయ్యేలా జాగింగ్‌ చేయకూడదు. అలాగే నెలలు నిండేకొద్దీ శరీరం బరువు పెరుగుతుంది కాబట్టి జాగింగ్‌ వేగం తగ్గించాలి. అలాగే ఈత గర్భిణులకు అన్నివిధాలుగా సురక్షితమైన వ్యాయామం ఇది. పెరిగిన శరీర బరువుతో అలసిన శరీరాలు ఈతతో సేద తీరతాయి. శరీరం తేలికైన భావన కలుగుతుంది. గుండె వేగం పెరిగి రక్తప్రసరణ మెరుగవుతుంది. స్వాంతన కూడా దక్కుతుంది. యోగా చెయ్యడం వల్ల గర్భం దాల్చినప్పుడు, కండరాలు, లిగమెంట్లు సాగుతాయి.