మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉంటాయి. అయితే కొందరు బల్లులు ఇంట్లో ఉండడానికి శుభశకునంగా భావిస్తే మరి కొందరు ఆశుభంగా భావిస్తారు. బల్లులు మీద పడితే ప్రమాదమని, ఇంట్లో (House) ఉండడం అంత మంచిది కాదు అని వాటిని బయటికి తరిమేస్తూ ఉంటారు. అయితే ఎన్నిసార్లు బయటకి వాటిని పారేసిన కూడా అవి ఏదో ఒక విధంగా మళ్లీ ఇంట్లోకి వస్తూనే ఉంటాయి. ఆ సంగతి పక్కన పెడితే బల్లులు ఇంట్లో (House) ఉండవచ్చా లేదా? అలాగే తోక ఊడిన బల్లి చూస్తే ఏం జరుగుతుంది?ఎటువంటి ఫలితాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re Now on WhatsApp. Click to Join.
ఇంట్లో బల్లి కనిపిస్తే జీవితంలోకి ఏదో కొత్త విషయం రాబోతోందని అర్థమట. జీవితం ఒకసారి రిఫ్రెష్ అవుతుందనేందుకు సంకేతమని పండితులు చెబుతున్నారు. అదృష్టం, సంపద మీ దరి చేరబోతున్నాయనేందుకు గుర్తుగా ఇంట్లో బల్లి కనిపిస్తుందట. అలాగే కలలు భవిష్యత్తును తెలియజేసే సాధనాలు. ఇవి ఒక్కోసారి జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. కొంత మందికి బల్లి కలలో కనిపిస్తుంది. కొంత మందికి ఎక్కడికి వెళ్తే అక్కడ బల్లులు లేదా బల్లుల బొమ్మలు లేదా ఏదో ఒక బల్లికి సంబంధించిన చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి. ఏదో ఒక అర్థంతోనే బల్లులు మనకు ఇంట్లో కనిపిస్తాయి. ఒక్కోసారి యాదృశ్చికం కూడా కావచ్చు. ఆహారం, నీళ్లు, నీడ కోసం వెతుకుతూ ఇంట్లోకి వస్తూ ఉంటాయి.
అయితే ఇంట్లో బల్లులు కనిపించాయంటే రకరకాల అర్థాలు ఉన్నప్పటికీ కొన్ని సాధారణ అర్థాల గురించి చెప్పుకుందాం. కాగా దాదాపు అన్ని మతాలల్లోనూ అన్ని సంస్కృతుల్లోనూ బల్లులు ప్రత్యేకమైన ప్రతీకాత్మకత కలిగిన జీవులు. ఆధ్యాత్మిక సంకేతాలుగా కూడా భావిస్తారు. కాగా ఇంట్లో బల్లి కనిపించిందంటే మీ ఇల్లు సురక్షితమైంది, ఆశ్రయం ఇచ్చేందుకు అనువైనదని అర్థం. వ్యక్తిగా మీరు అన్ని రకాలుగా అంగీకారయోగ్యమైన వారని అర్థం. మాములుగా బల్లులు మనుషులకు దూరంగా ఉంటాయి. అయినా మీకు కనిపించింది అంటే కచ్చితంగా ప్రత్యేక కారణం లేకుండా ఉండదు. ఒకవేల బల్లి కనిపించింది అంటే కొత్త విషయాలేవో మీ జీవితంలోకి రాబోతున్నాయని అర్థం. కొత్త వ్యక్తుల రాకతో మీ జీవితం మరింత మెరుగవుతుందని అర్థం. కాగా చైనీయులు బల్లిని బేబీ డ్రాగన్ గా భావిస్తారు.
ఇది సంపద, కీర్తి, ప్రతిష్టలకు సంకేతంగా భావిస్తారు. పాత మిత్రులు లేదా ఆత్మీయుల వ్యక్తుల గుర్తుగా కూడా బల్లి కనిపించవచ్చు. కొన్ని దేశాలలో ఇంట్లో ఆత్మీయుల మరణం తర్వాత బల్లి కనిపిస్తే శుభశకునంగా భావిస్తారు. అలాగే కష్టంలో ఉన్నపుడు బల్లి కనిపిస్తే మీరు మీ కష్టాన్ని విజయవంతంగా గట్టెక్కుతారని అర్థం. బల్లి తన మనుగడ కోసం జరిగే పోరాటంలో అవసరమైతే తోక వదులుకుంటుంది. ఇది జీవితం త్యాగాన్ని ఆశిస్తుందని చెప్పటానికి సంకేతంగా బావించాలి.
Also Read: Kia Seltos: కియా కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సెల్టోస్ ధరలను తగ్గించిన కంపెనీ..!