Hepatitis B: సెక్స్ వల్ల కూడా “హెపటైటిస్ బి” వస్తుందా?

సెక్సువల్ కార్యకలాపాల (Sexual Activities) ద్వారా "హెపటైటిస్ బి" వ్యాపిస్తుందా? ఈ డౌట్ పై వైద్య నిపుణులు ఏమంటున్నారు?

సెక్సువల్ కార్యకలాపాల  ద్వారా “హెపటైటిస్ బి” (Hepatitis B) వ్యాపిస్తుందా? ఈ డౌట్ పై వైద్య నిపుణులు ఏమంటున్నారు ? “హెపటైటిస్ బి” అంటే ఏమిటి ? దానికి సెక్సువల్ కార్యకలాపాలకి సంబంధం ఏమిటి ? అనేది ఇప్పుడు చూద్దాం..

లివర్ చేసే పని ఏమిటి?

మన పొత్తి కడుపు కుడివైపున పై భాగంలో లివర్ ఉంటుంది. ఇది అనేక ముఖ్యమైన పనులు చేస్తుంది. దీని యాక్టివిటీస్ శరీరంలోని మెటాబాలిజంపై ప్రభావం చూపిస్తాయి. లివర్ మన శరీరంలోని టాక్సిన్స్ ను ఫిల్టర్ చేస్తుంది. బైల్ ను ఉత్పత్తి చేస్తుంది.కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ , ప్రోటీన్స్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది. శరీర విధులకు అవసరమయ్యే ఎంజైమ్స్ ను యాక్టివేట్ చేస్తుంది. గ్లైకోజెన్ అనే ఒక రకమైన షుగర్ ను స్టోర్ చేసి ఉంచుతుంది. విటమిన్ ఏ, డీ, ఈ, కే తో పాటు మినరల్స్ ను స్టోర్ చేసి ఉంచుతుంది.

హెపటైటిస్ (Hepatitis ) ఏమిటి? ఎందుకు వస్తుంది?

లివర్ ఇన్ఫ్లమేషన్ సమస్యను “హెపటైటిస్” అంటారు. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఐతే ఇతర కారణాలు కూడా ఇది రావడానికి కారణం కావచ్చు. మెడిసిన్స్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్, టాక్సిన్స్, ఆల్కహాల్ , ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వంటివి లివర్ ఇన్ఫ్లమేషన్ కు కారణం అవుతాయి.

హెపటైటిస్ బి (Hepatitis B) అంటే?

హెపటైటిస్ బి వైరస్ (HBV) అనేది ఇన్ఫెక్ట్ అయిన రక్తం, వీర్యం లేదా ఇతర శరీర ద్రవాల ద్వారా సోకుతుంది. ఇన్ఫెక్టు అయిన పార్ట్నర్ తో సెక్స్,ల్.. ఇన్ఫెక్టు అయిన వ్యక్తితో రేజర్ షేర్ చేసుకోవడం వంటి వాటి వల్ల హెపటైటిస్ బి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాబ్లమ్ తో 350 మిలియన్ల మంది బాధపడుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం కొనసాగితే మీ కాలేయం ఫెయిల్ అవుతుంది.
హెపటైటిస్ బి యొక్క లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

హెపటైటిస్ బి (Hepatitis B) లక్షణాలు

తలనొప్పి, కీళ్ల నొప్పులు

హెపటైటిస్ కాలేయంలో మంటను కలిగిస్తుంది. ఇది తక్కువ స్థాయి జ్వరాన్ని ప్రేరేపిస్తుంది.  పెరిగిన శరీర ఉష్ణోగ్రతతో పాటు, అలసట, తలనొప్పి, కీళ్ల నొప్పులు కూడా రావచ్చు.

కడుపు నొప్పి

మాయో క్లినిక్ ప్రకారం.. HBV సోకిన వ్యక్తికి కడుపు నొప్పి కూడా రావచ్చు. సాధారణంగా మీకు ఇది సోకిన 1 నుండి 4 నెలల తర్వాత ఈ లక్షణం కనిపించడం ప్రారంభమవుతుంది.

మూత్రం రంగు డార్క్

హెపటైటిస్ బి ఫౌండేషన్ , హెపటైటిస్ బి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి మూత్రం బాగా డార్క్ కలర్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది.మూత్రం రంగులో ఈవిధంగా మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. మీ కాలేయం సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి రక్త పరీక్షలు నిర్వహించబడతాయి.

వికారం, వాంతులు

హెపటైటిస్ బి కాలేయ వాపుకు కారణమవుతుంది. ఇది జీర్ణశయాంతర లక్షణాలకు కూడా దారితీస్తుంది. వీటిలో వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటివి ఉన్నాయి.

చర్మం పసుపు రంగులోకి

కాలేయ వాపు, హెపటైటిస్ B ఇన్ ఫ్లమేషన్ అనేది శరీరంలో బైలిరుబిన్ మోతాదు పెరుగుదలకు కారణమవుతుంది. ఇది పచ్చ కామెర్ల సమస్యకు దారితీస్తుంది. రక్తంలోని బైలిరుబిన్ అనే రసాయనం కారణంగా చర్మం పసుపు రంగులోకి మారుతుంది. అయితే, హెపటైటిస్ మరియు కామెర్ల మధ్య తేడాను గుర్తించాలంటే వైద్యుణ్ణి సంప్రదించండి.

హెపటైటిస్ (Hepatitis) ఏ అంటే?

హెపటైటిస్ ఏ అనేది అక్యూట్ అలాగే షార్ట్ టర్మ్ వ్యాధి. హెపటైటిస్ బి, సి, మరియు డి వంటివి క్రానిక్ సమస్యలు. హెపటైటిస్ ఈ కూడా సాధారణంగా అక్యూట్ డిసీజ్. ఐతే, గర్భిణీలకు మాత్రం ప్రాణాంతకం.

ఆల్కహాల్ తో పాటు ఇతర టాక్సిన్స్ వల్ల..

ఎక్కువగా ఆల్కహాల్ ను తాగితే లివర్ ఇన్ఫ్లమేషన్ కు గురై డ్యామేజ్ అవుతుంది. దీన్నే ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. లివర్ కు చెందిన కణాలను ఆల్కహాల్ గాయపరుస్తుంది. ఫలితంగా లివర్ ఫెయిల్యూర్ జరుగుతుంది. సిర్రోసిస్ అనే ప్రాణాంతక కండిషన్ కు కూడా దారితీయవచ్చు. కొన్ని రకాల మెడిసిన్స్ అతిగా తీసుకోవడం వల్ల కూడా హెపటైటిస్ సమస్య తలెత్తుతుంది.

ఆటో ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్

కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ లివర్ ను హానికర పదార్థంగా భావించి ఎటాక్ చేస్తుంది. దీని వల్ల చిన్నపాటి నుంచి తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ తలెత్తవచ్చు. దీంతో, లివర్ పనితీరు దెబ్బతింటుంది. ఈ సమస్య వచ్చే అవకాశం పురుషులతో పోలిస్తే మహిళల్లో మూడు రెట్లు ఎక్కువ.

Also Read:  Heart Health Tips: గుండె ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు తప్పనిసరి!