Hair Fall: జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొంతమందికి అయితే మరీ దారుణంగా కుచ్చులు కుచ్చులుగా ఎక్కువ మొత్తం

  • Written By:
  • Publish Date - February 4, 2024 / 09:40 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొంతమందికి అయితే మరీ దారుణంగా కుచ్చులు కుచ్చులుగా ఎక్కువ మొత్తంలో వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. జుట్టు రాలిపోవడం పెద్ద సమస్య అనుకుంటే వాటికి తోడు జుట్టు త్వరగా తెల్ల బడటం, చిట్లిపోవడం వంటి సమస్యలు మరింత బాధ పెడుతూ ఉంటాయి. జుట్టు రాలే సమస్యను అధిగమించడానికి చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకోసం వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. అయితే మీరు కూడా అలా అధిక హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతుంటే ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు. మరి అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలి అన్న విషయానికి వస్తే. డిప్రెషన్ కారణంగా జుట్టు రాలడం పెరుగుతుంది.

డిప్రెషన్‌తో బాధపడే వారు రెగ్యులర్‌గా పరిశుభ్రంగా ఉంటూ మంచి ఆహారం తీసుకోవాలి. దీని వల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. కొందరు కొన్ని వారాల పాటు తలస్నానం చేయరు. దీంతో జుట్టు రాలడం పెరుగుతుంది. ఒత్తిడి విషయానికొస్తే, ఇది నేరుగా టెలోజెన్ ఎఫ్లూవియం, ట్రైకోటిల్లోమానియా, అలోపేసియా అరేటా వంటి వ్యాధుల ద్వారా జుట్టు పల్చబడటానికి దారితీస్తుంది. శరీరంలో ఒత్తిడి సూచించే అనేక మార్గాలు ఉన్నాయి. మీ జుట్టు రాలడం కూడా ఒకటి, జుట్టు రాలడం, తెల్లబడడం వంటివి ఒత్తిడి లక్షణాలు. తక్కువ వాల్యూమ్ కలిగి ఉంటుంది.దీని వల్ల జుట్టు డ్రైగా మారుతుంది. అదనంగా, మీకు చుండ్రు ఉండే, ఒత్తిడి పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. చాలా మంది జుట్టు రాలడాన్ని నయం చేసేందుకు సప్లిమెంట్స్‌ని తీసుకుంటారు.

విటమిన్స్/సప్లిమెంట్స్ హెల్ప్ చేసినప్పటికీ, వీటితో పాటు ప్రోటీన్, విటమిన్స్, జింక్, ఇతర ఖనిజాలతో నిండిన మంచి, సమతుల్య ఆహారంతో తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తగినంతగా నీరు తీసుకోవాలి. బాగా నిద్రపోవాలి. మీ జుట్టుని కాపాడుకోవడానికి హెల్దీ లైఫ్‌స్టైల్‌ని పాటించాలి. జుట్టుని కాపాడుకోవాలంటే సాధారణంగాన ప్రాసెస్ చేసిన నూనెలు, హెయిర్ స్పాలు, జుట్టు రాలడాన్ని నియంత్రించే ఏదైనా ప్రోడక్ట్‌ని ఉపయోగిస్తాం. కానీ, పరిస్థితిని ఫేస్ చేయడానికి ఓ సాధారణ మార్గం ఉంది. జుట్టుని చాలా సున్నితంగా కాపాడుకోవాలి. తడి జుట్టుని దువ్వొద్దు. తేలికపాటి షాంపూ వాడాలి. మీ షాంపూ లేబుల్స్ ఎప్పుడూ చదవడం మంచిది. విపరీతంగా జుట్టు రాలుతుంటే డాక్టర్‌ని సంప్రదించాలి.

వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్ చేయడం వల్ల మీ హెయిర్ ఫోలికల్స్ హైడ్రేట్ అవుతాయి. తలపై నూనెని ఒకటి కంటే ఎక్కువ వాడవద్దు. నూనె అప్లై చేశాక తర్వాత నేరుగా దువ్వెన వాడవద్దు వారానికి ఒకసారి కంటే ఎక్కువ నూనె ఉపయోగించకూడదు. జుట్టుని ఎప్పుడూ లాస్ గా వదిలేయకూడదు. అలా అని మరి గట్టిగా అల్లొకూడదు.. ఒత్తిడి వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం, వర్కౌట్ చేయాలి. పోషకాహారం తీసుకోవాలి.