Site icon HashtagU Telugu

Dark Circles: అరటిపండుతో ఇలా చేస్తే చాలు.. డార్క్ సర్కిల్స్ మాయం?

Dark Circles

Dark Circles

ముఖం ఎంత అందంగా కళ్ళు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. అటువంటి కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే అందం మొత్తం పాడవడంతో పాటు ముఖం కూడా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా కళ్లద్దాలు పెట్టుకున్న వారికి డార్క్ సర్కిల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. స్త్రీ పురుషులు ఈ డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్స్ ని ఉపయోగించినా ఫలితం లేకపోవడం వల్ల బాధపడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే అటువంటి డార్క్ సర్కిల్స్ అద్భుతంగా అరటిపండు తొక్క ఎంతో బాగా ఉపయోగపడుతుంది..

మరి అరటిపండుతో డైరెక్ట్ సర్కిల్స్ ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరటి తొక్కలో ఎక్కువగా పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి కింద నల్లని వలయాలని దూరం చేస్తుంది. అరటి తొక్కలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోతుగా కాపాడతాయి. అంతేకాకుండా అరటిపండు తొక్కలో కొల్లాజెన్ ఉంటుంది. ఇది రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది. డార్క్ సర్కిల్స్ ని తగ్గాలంటే అరటి పండు తొక్కని తీసుకుని దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత వాటిని ఫ్రిజ్ నుంచి తీసి మీ కళ్ళ కింద రుద్దండి. ఈ తొక్కలను కళ్ళ కింద సుమారు 15 నిమిషాల ఉంచాలి.

తర్వాత నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే అరటిపండు తొక్కని మెత్తగా చేయాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలపాలి. తర్వాత ఈ పేస్ట్‌ని కంటి కింద అప్లై చేయాలి. దీని తర్వాత మీరు సుమారు 8 నుంచి 10 నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తర్వాత ముఖం కడగాలి. ఇలా చేయడం వల్ల తేమని అందించి నల్లని వలయాలని దూరం చేస్తుంది. డార్క్ సర్కిల్స్ ని పోగొట్టుకోవడానికి మరొక పద్ధతి ఏమిటంటే.. ముందుగా అరటితొక్కని ముక్కలుగా కట్ చేసి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌లో అలోవెరా జెల్ వేసి కలపాలి. తర్వాత ఈ పేస్ట్‌ని మీ కళ్ళ కింద మందపాటి పొరగా వేయాలి. కొంత సమయం తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ దూరమవుతాయి.

Exit mobile version