Site icon HashtagU Telugu

Califlower Paneer Kofta: రెస్టారెంట్ స్టైల్ క్యాలీఫ్లవర్‌ పనీర్‌ కోఫ్తా.. ఇంట్లోనే చేసుకోండిలా?

Mixcollage 02 Feb 2024 07 25 Pm 6308

Mixcollage 02 Feb 2024 07 25 Pm 6308

మామూలుగా చాలామంది ఎప్పుడు తినే వంటకాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఏమైనా కొత్త వంటకాలు తినాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా ఏవైనా కొత్తగా రెసిపీలు తినాలి అనుకుంటున్నారా. అయితే రెస్టారెంట్ స్టైల్ లో క్యాలీఫ్లవర్‌ పనీర్‌ కోఫ్తాను ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

క్యాలీఫ్లవర్‌ పనీర్‌ కోఫ్తాకి కావలసిన పదార్థాలు :

క్యాలీఫ్లవర్‌ – ఒకటి
పనీర్‌ ముక్కలు – అరకప్పు
బంగాళదుంపలు – నాలుగు
కార్న్‌ఫ్లోర్‌ – మూడు టేబుల్‌ స్పూన్లు
కారం – ఒక టేబుల్‌ స్పూన్‌
ధనియాల పొడి – ఒక టేబుల్‌ స్పూన్‌
జీలకర్రపొడి – ఒక టీ స్పూన్‌
గరంమసాల – ఒక టీస్పూన్
ఉప్పు – తగినంత
ఉల్లిపాయలు – రెండు
టొమాటోలు – నాలుగు
వాము – ఒక టీస్పూన్‌
కారం – ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌
గరంమసాలా – ఒక టీస్పూన్‌
ధనియాల పొడి – ఒక టేబుల్‌స్పూన్‌
ఉప్పు – రుచికి తగినంత
నూనె – ఒక టేబుల్‌స్పూన్‌
క్రీమ్‌ – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా

క్యాలీఫ్లవర్‌ పనీర్‌ కోఫ్తా తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా క్యాలీఫ్లవర్‌ను ముక్కలుగా కట్‌ చేసి ఉప్పు వేసి మరిగించిన నీళ్లలో వేయాలి. మూడు నాలుగు నిమిషాల పాటు వేడి నీళ్లలో ఉంచి తరువాత పొడి టవల్‌ వేసి పెట్టుకున్న మరో పాత్రలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యాలీఫ్లవర్‌లు డ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి క్యాలీఫ్లవర్‌ ముక్కలు డ్రై రోస్ట్‌ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కాసేపు వేగించుకుంటే సరిపోతుంది. అలా వేగించుకున్న క్యాలీఫ్లవర్‌ ముక్కలను ఒక పాత్రలోకి తీసుకుని అందులో పనీర్‌ ముక్కలు వేయాలి. బంగాళదుంపల గుజ్జు, కార్న్‌ఫ్లోర్‌తో పాటు ఉల్లిపాయలు, టొమాటోలు, వాము, గరంమసాలా, ధనియాల పొడి, తగినంత కారం, ఉప్పు, క్రీమ్‌ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కోఫ్తాలుగా చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక కోఫ్తాలను వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించి తీసుకోవాలి. కర్రీ తయారీ కోసం పాన్‌లో కాస్త నూనె వేసి వేడి అయ్యాక వాము, ఉల్లిపాయలు వేసి వేగించాలి. టొమాటో ప్యూరీ వేసుకోవాలి. కారం, గరంమసాలా, ధనియాల పొడి వేసి, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. చివరగా క్రీమ్‌ వేసి కలుపుకోవాలి. వేగించి పెట్టుకున్న కోఫ్తాలతో కలుపుకోవాలి. చిన్నమంటపై కాసేపు ఉంచి దింపుకోవాలి.

Exit mobile version