Site icon HashtagU Telugu

Cabbage Chutney: ఎంతో రుచికరమైన క్యాబేజీ పచ్చడి.. తయారీ చేసుకోండిలా?

Mixcollage 26 Dec 2023 06 16 Pm 9450

Mixcollage 26 Dec 2023 06 16 Pm 9450

మామూలుగా క్యాబేజీతో అనేక రకాల రెసిపీలు తింటూ ఉంటాం. మన ఇంట్లో కేవలం రెండు మూడు రకాల రెసిపీలు మాత్రమే తయారు చేసుకుంటూ ఉంటాము. కానీ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఇలా క్యాబేజీతో ఎన్నో రకాల డిఫరెంట్ వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో క్యాబేజీ పచ్చడి కూడా ఒకటి. ఇది వినడానికి కాస్త వెరైటీగా ఉన్నప్పటికీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి ఈ క్యాబేజీ పచ్చడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

నూనె – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – అర టీ స్పూన్
ధనియాలు – 1 టీస్పూన్
పచ్చిమిర్చి – 10
ఎండు మిర్చి – 4
వెల్లుల్లి రెబ్బలు – 5
క్యాబేజి తరుగు- 150 గ్రాములు
పసుపు – పావు టీ స్పూన్
చింతపండు – కొద్దిగా
టమాటాలు – 3
ఉప్పు – రుచికి సరిపడా

క్యాబేజీ పచ్చడి తయారీ విధానం:

ముందుగా గ్యాస్ పై ఒక కడాయి పెట్టుకొని నూనె పోసి వేడయ్యాక జీలకర్ర, ధనియాలు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత క్యాబేజీ తరుగు, పసుపు వేసి కలుపుకోవాలి. వీటిపై మూతపెట్టి క్యాబేజీని పూర్తిగా మగ్గించుకోవాలి. క్యాబేజీ వేగిన తర్వాత చింతపండు, టమాట ముక్కలు వేసుకోవాలి. వీటిని మీడియం మంటపై కలపుతూ టమాట ముక్కలు మెత్తగా ఉడికే వరకు మగ్గించుకోవాలి. తర్వాత స్టఫ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసి వేడి చేసి అందులో తాళింపు దినుసులు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో వేసి స్టఫ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన క్యాబేజీ పచ్చడి రెడీ.

Exit mobile version