Site icon HashtagU Telugu

Salt Water: ముఖంపై మొటిమలు తగ్గి చర్మం మెరిసిపోవాలంటే ఈ నీటితో ముఖం శుభ్రం చేసుకోవాల్సిందే?

Mixcollage 04 Feb 2024 06 13 Pm 3525

Mixcollage 04 Feb 2024 06 13 Pm 3525

చాలా మంది చర్మం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా మొటిమలు వాటి తాలూకా మచ్చలు వంటి వాటికోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖంపై మొటిమలను తగ్గించుకోవడానికి చాలామంది ఆయుర్వేద చిట్కాలు హోమ్ రెమిడీలు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్లు, ఫేస్ క్రీములు ఉపయోగిస్తూ ఉంటారు. మీకు తెలుసా ఇవన్నీ కాకుండా ఉప్పునీటితో మొటిమల సమస్యకు చెక్ పెట్టవచ్చట. అదేంటి ఉప్పు నీటితో మొటిమలు రావా అంటే అవును అంటున్నారు నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉప్పు నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య దూరం అవుతుంది.

ఉప్పు నీరు చర్మంలోని బ్యాక్టీరియాను గ్రహిస్తుంది. ఇది చర్మం రంధ్రాలను తగ్గించడానికి, బిగుతుగా చేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మం నుంచి రంధ్రాలను అడ్డుకునే నూనె, టాక్సిన్‌లను పీల్చుకుంటుంది. ఇది బ్రేక్‌ అవుట్‌ లను తగ్గిస్తుంది. మీరు స్పష్టమైన, మెరిసే చర్మం పొందడానికి ఉప్పు నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. అలాగే ఉప్పు నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే తామర, సోరియాసిస్‌, చర్మం పొడిబారడం వంటి చర్మ సమస్యలు దూరం అవుతాయి. ఉప్పు నీరు మీ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. సముద్రపు ఉప్పులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక చర్మ సమస్యలకు చెక్‌ పెట్టడానికి, చర్మం నుంచి విషాన్ని తొలగించడానికి తోడ్పడతాయి.

సాల్ట్ వాటర్ ఫేషియల్ టోనర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మరంధ్రాలను కుదించడానికి, చర్మం నుంచి నూనెను తొలగించడానికి, చర్మం నునుపుగా, రిఫ్రెష్‌గా మార్చడానికి తోడ్పడుతుంది. మీ ముఖాన్ని ఉప్పు నీటితో శుభ్రం చేసినా, మేకప్‌ వేసే ముందు ఉప్పు నీరు స్ప్రే చేసుకున్నా మీ చర్మం రోజంతా జిడ్డు లేకుండా, తాజాగా ఉంటుంది. ఉప్పు అద్భుతమైన ఎక్స్‌ఫోలియంటర్‌. ఇది డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగిస్తుంది, చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. మీరు ఉప్పు నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది, స్కిన్‌ టోన్‌ మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ఉప్పు నీళ్లు చర్మాన్ని డిటాక్స్‌ చేస్తాయి. ఇది చర్మం నుంచి బ్యాక్టిరియా, క్రిములను శోషిస్తుంది. ఇది చర్మం నుంచి హానికరమైన టాక్సిన్స్, బ్యాక్టీరియాను పీల్చుకుంటుంది. ఉప్పు నీళ్లు డిటాక్సిఫయర్‌గా పనిచేస్తుంది. మీరు యంగ్‌, మెరిసే లుక్‌ సొంతం చేసుకోవాలంటే ఉప్పు నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సిందే.