మామూలుగా ముఖాన్ని ఎంత బాగా క్లీన్ చేసుకున్నా కూడా కొన్ని కొన్ని సార్లు ముఖంపై మొటిమలు రావడం అన్నది సహజం. కొందరు చల్ల నీటితో ముఖాన్ని శబ్దం చేసుకుంటే మరికొందరు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా ఉప్పు నీళ్లతో ముఖాన్ని ఎప్పుడైనా శుభ్రం చేసుకున్నారా. ఉప్పు నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ఏంటా అనుకుంటున్నారా. ఉప్పు నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉప్పు నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య దూరం అవుతుంది. ఉప్పు నీరు చర్మంలోని బ్యాక్టీరియాను గ్రహిస్తుంది. ఇది చర్మం రంధ్రాలను తగ్గించడానికి, బిగుతుగా చేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మం నుంచి రంధ్రాలను అడ్డుకునే నూనె, టాక్సిన్‌లను పీల్చుకుంటుంది. ఇది బ్రేక్‌అవుట్‌లను తగ్గిస్తుంది. మీరు స్పష్టమైన, మెరిసే చర్మం పొందడానికి ఉప్పు నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఉప్పు నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే తామర, సోరియాసిస్, చర్మం పొడిబారడం వంటి చర్మ సమస్యలు దూరం అవుతాయి. ఉప్పు నీరు మీ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. సముద్రపు ఉప్పులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి అనేక చర్మ సమస్యలకు చెక్ పెట్టడానికి, చర్మం నుంచి విషాన్ని తొలగించడానికి తోడ్పడతాయి. సాల్ట్ వాటర్ ఫేషియల్ టోనర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మరంధ్రాలను కుదించడానికి, చర్మం నుంచి నూనెను తొలగించడానికి, చర్మం నునుపుగా, రిఫ్రెష్‌గా మార్చడానికి తోడ్పడుతుంది. మీ ముఖాన్ని ఉప్పు నీటితో శుభ్రం చేసినా, మేకప్ వేసే ముందు ఉప్పు నీరు స్ప్రే చేసుకున్నా కూడా మీ చర్మం రోజంతా జిడ్డు లేకుండా, తాజాగా ఉంటుంది.
ఉప్పు అద్భుతమైన ఎక్స్‌ఫోలియంటర్. ఇది డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగిస్తుంది, చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. మీరు ఉప్పు నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది, స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది.