Age Vs Sleep : ఏ వయసు వారు.. రోజూ ఎంతసేపు నిద్రపోవాలో తెలుసా ?

ఆరోగ్యంగా ఉండాలంటే మనకు కంటి నిండా నిద్ర అవసరం. సరిగ్గా నిద్రపోకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి.

  • Written By:
  • Updated On - July 20, 2024 / 09:26 AM IST

Age Vs Sleep : ఆరోగ్యంగా ఉండాలంటే మనకు కంటి నిండా నిద్ర అవసరం. సరిగ్గా నిద్రపోకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. నిద్రలేకపోతే రోజంతా చికాకుగా, అలసటగా అనిపిస్తుంది. పిల్లలకైనా, పెద్దలకైనా ఇది కామన్. రోజూ ఎన్ని గంటలు నిద్రపోవాలనేది(Age Vs Sleep).. వయసును బట్టి డిఫరెంటుగా ఉంటుంది. ఆ లెక్కల గురించి అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్, స్లీప్ రీసెర్చ్ సొసైటీ పరిశోధకులు తెలిపిన వివరాలతో కథనమిది.

We’re now on WhatsApp. Click to Join

  • 3 నెలల్లోపు నవజాత శిశువులు రోజుకు దాదాపు 14 గంటల నుంచి 17 గంటలు నిద్రపోతే బెటర్. ఎందుకంటే.. ఈ శిశువులు పెరుగుదలలో ఉండటంతో వారి శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. నిద్రవల్ల వారి పెరుగుదల సరిగ్గా జరుగుతుంది.
  • 4 నుంచి 11 నెలలోపు శిశువులకు రోజుకు 12 నుంచి 15 గంటలలోపు నిద్ర అవసరం. ఈ వయసులో శిశువుల మెదడు, శరీరం బాగా డెవలప్ అవుతాయి. అందుకే వీరికి నిద్ర అత్యవసరం.
  • 1 నుంచి 2 సంవత్సరాలలోపు పసిపిల్లలకు రోజుకు 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం. ఈ పిల్లలు సరిగ్గా నిద్రపోతే మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది.
  • 3 నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు రోజుకు 10 నుంచి 13 గంటల నిద్ర అవసరం. ఈ ఏజ్‌లో పిల్లలు ప్రైమరీ స్కూల్‌‌కు వెళ్తుంటారు.  స్కూల్‌‌కు వెళ్లి చదువుకొని, ఆడుకొని పిల్లలు అలసిపోతుంటారు. అందుకే వారికి నిద్ర ఎక్కువగా పడుతుంది.
  • 6 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు రోజుకు 9 నుంచి 12 గంటల నిద్ర అవసరం. పిల్లలు పెరిగే ఏజ్ ఇది. ఈ టైంలో పిల్లలకు కనీస నిద్ర తప్పనిసరి. దీనివల్ల వారి ఎదుగుదల సరైన రీతిలో జరుగుతుంది.

Also Read :BSF Jobs : బీఎస్ఎఫ్‌లో 141 కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు

  • 13 నుంచి 18 ఏళ్లలోపు టీనేజర్లకు రోజుకు 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం. ఈ ఏజ్‌లో పిల్లలు చదువు, ఆటల్లో, ఫోన్లలో బిజీగా ఉంటారు. దీనివల్ల వారు స్కూలు నుంచి ఇంటికి వచ్చేసరికి బాగా అలసిపోతారు. వారికి మంచి నిద్ర అవసరం. లేదంటే మరుసటి రోజు స్టడీస్‌పై ఫోకస్ చేయలేరు. శరీరంలో పునరుత్పత్తి అవయవాలు అభివృద్ధి చెందే ఏజ్ ఇది. కనీస నిద్ర మస్ట్.
  • 18 నుంచి 60 ఏళ్లలోపు వారికి రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. ఈ ఏజ్‌లో చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ ప్రతికూల ప్రభావం ఆరోగ్యంపై పడి వివిధ వ్యాధులు వస్తుంటాయి. ఉద్యోగపరమైన ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య కారణాల వల్ల చాలామంది రోజూ సరిగ్గా నిద్రపోరు. ఎన్ని సమస్యలున్నా నిద్రకు సమయం కేటాయించాలని గుర్తుంచుకోవాలి.
  • 61ఏళ్లకు పైబడిన వారికి రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర (Sleeping Tips) అవసరం. ఈ ఏజ్‌లో చాలామంది రెస్ట్ తీసుకుంటుంటారు. అయినప్పటికీ అతినిద్ర సరికాదు. చిన్నపాటి ఇంటిపనులు చేస్తూ సమయం ఈజీగా గడిచిపోతుంది. రోజూ ఉదయాన్నే లేచే అలవాటు చేసుకోవాలి. యోగా, ధ్యానం  వంటివి చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఈ ఏజ్‌లో కీళ్ల నొప్పుల సమస్యలు, పలు వ్యాధులతో చాలామంది కంఫర్ట్‌గా నిద్రపోలేరు.
Follow us