Sunglasses: సమ్మర్ కోసం సన్ గ్లాసెస్ కొంటున్నారా.. ఇవి తెలుసుకోండి

వేసవి వచ్చిందంటే చాలామంది సన్ గ్లాసెస్ వాడు తుంటారు. సూర్యరశ్మి నుంచి,

వేసవి వచ్చిందంటే చాలామంది సన్ గ్లాసెస్ (Sunglasses) వాడు తుంటారు. సూర్యరశ్మి నుంచి, హానికరమైన అతినీలలోహిత కిరణాల (యూవీ రేస్) నుంచి కళ్లను రక్షించుకోవడానికే వీటిని ధరిస్తారు. ఇక్కడి వరకు ఓకే.. కానీ సన్ గ్లాసెస్ నాణ్యతపై పెద్దగా ఫోకస్ పెట్టరు. సన్ గ్లాసెస్ (Sunglasses) కొనేటప్పుడు వాటి లుక్, డిజైన్, క్వాలిటీ ముఖ్యమని గుర్తుంచుకోండి. ఎక్కడపడితే అక్కడ .. తక్కువ రేటుకు వచ్చే నాసిరకం గాగుల్స్ కొని వాడితే కంటి ఇన్ఫెక్షన్లు, దృష్టి లోపాలు వస్తాయి.

నాసిరకం గాగుల్స్ వాడితే..

  1. నాసిరకం, తక్కువ రేటు గాగుల్స్ దుష్ప్రభావాల వల్ల కంటిలో చికాకు, కళ్లలో నీళ్లు , దృశ్యమాన వక్రీకరణ, తలనొప్పి, దృష్టి మసకబారడం వంటి సమస్యలు వస్తాయి.
  2. కళ్ళద్దాల లెన్స్‌లు సాధారణంగా గాజు లేదా ఫైబర్‌తో తయారు చేయబడతాయి.
  3. నాసిరకం సన్‌ గ్లాసెస్‌లో.. లెన్స్ ను నాణ్యత లేని ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. దానివల్ల రంగులు చాలా డిఫరెంట్ గా కనిపించి కంటి సమస్యలను సృష్టిస్తాయి.
  4. పోలరైజ్డ్ లెన్స్‌ ఉన్న గాగుల్స్ తీసుకోవాలి. దీనివల్ల విజువల్ క్లారిటీ ఉంటుంది.  కంటిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.
  5. సన్‌ గ్లాసెస్‌ ను కూడా డాక్టర్‌ను సంప్రదించాకే తీసుకోండి.
  6. ముఖ్యంగా మయోపియా లేదా హైపర్‌ మెట్రోపియా ఉన్నవారు తమ కళ్ల శక్తికి అనుగుణంగా ఫోటోక్రోమాటిక్ గ్లాసెస్ ధరించాలి.

వేసవిలో సన్ గ్లాసెస్ (Sunglasses) ఎందుకు ధరించాలి?

  1. సూర్యరశ్మి కంటిపై ఎక్కువ పడితే శుక్లం వచ్చే ముప్పు పెరుగుతుంది. గ్లాకోమా , రెటీనా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సన్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల ఈ కంటి సమస్యలు తలెత్తకుండా నిరోధించవచ్చు.
  2. వేసవిలో సన్ గ్లాసెస్ ధరించడం వల్ల UV ఎక్స్ పోజర్ సంబంధిత కంటి క్యాన్సర్లను నివారించవచ్చు.
  3. స్విమ్మింగ్ పూల్ దగ్గర, బీచ్ దగ్గర పడుకున్నప్పుడు, కారు/బైక్ నడుపుతున్నప్పుడు సూర్యరశ్మికి గురయ్యే అవకాశం ఉంది. సమ్మర్ లో అటువంటి టైంలో గాగుల్స్ ధరించడం బెస్ట్.

సన్ గ్లాసెస్ (Sunglasses) చరిత్ర..

పూర్వకాలంలో రోమన్ రాజులు  పాలిష్ రత్నాలను సన్ గ్లాసెస్ లాగా ఉపయోగించేవారట. మరో పక్క చైనా వాళ్ళు 12వ శతాబ్దం లో సన్ గ్లాసెస్ గా నలుపు, బూడిద రంగు రాళ్ళని ఉపయోగించేవారట.
ఈ చరిత్ర ఆధారంగా జేమ్స్ ఐస్కాఫ్ అనే ఒక శాస్త్రవేత్త సన్ గ్లాసెస్ పై పరిశోధనలు చేశారు. ఆ రీసెర్చ్ అనంతరం గాజు కళ్లజోడును ప్రపంచానికి మొదట పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆ కళ్ళజోడు అనేక రూపాంతరాలు చెందుతూ వచ్చింది. వాటిలోనే సన్ గ్లాసెస్ కూడా ఒకటి.

Also Read:  Putin: బిడెన్ కైవ్ వీధుల్లో నడిచిన తర్వాత పుతిన్ ఉక్రెయిన్ యుద్ధ ప్రసంగానికి సిద్ధమయ్యారు