Site icon HashtagU Telugu

Burn Utensils: మాడిపోయిన పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోండిలా!

Burn Utensils

Burn Utensils

Burn Utensils: తరచుగా తెలియకుండానే వంట చేసేటప్పుడు పాత్రలు (Burn Utensils) మాడిపోతుంటాయి. వాటిని శుభ్రం చేయడం చాలా కష్టమైన పనిగా అనిపిస్తుంది. డిటర్జెంట్ లేదా స్క్రబ్బర్‌తో కూడా ఆ మరకలు సులభంగా పోవు. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో మీరు ఎక్కువ శ్రమ పడకుండానే మీ పాత్రలను కొత్త వాటిలా మెరిసేలా చేయవచ్చు. కాబట్టి మీరు పాటించగలిగే, మీ మాడిపోయిన పాత్రలను శుభ్రం చేయగలిగే 3 చిట్కాల గురించి తెలుసుకుందాం.

మాడిపోయిన పాత్రలను శుభ్రం చేసే పద్ధతులు

వెనిగర్- బేకింగ్ సోడాతో శుభ్రం చేయండి

మీ పాత్రలు మాడిపోయి ఉంటే అందులో 2-3 చెంచాల బేకింగ్ సోడా వేయండి. దానిపై 1-2 చెంచాల తెల్లటి వెనిగర్ కలపండి. దీనిని 10-15 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత స్పాంజ్ లేదా బ్రష్‌తో మెల్లగా రుద్ది శుభ్రం చేయండి. ఈ విధంగా మీ పాత్రలు శుభ్రమవుతాయి.

బేకింగ్ సోడా- నీటి పేస్ట్

పాత్రలను శుభ్రం చేయడంలో బేకింగ్ సోడా చాలా సహాయకారిగా ఉంటుంది. మీ పాత్రలపై మాడిపోయిన మరకలు పోవడం లేదంటే మీరు బేకింగ్ సోడా, నీటిని కలిపి చిక్కటి పేస్ట్‌ను తయారు చేయండి. ఈ పేస్ట్‌ను మాడిపోయిన భాగంలో రాసి 10 నిమిషాలు వదిలేయండి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఈ చిట్కా పాటించడం వలన మీ పాత్రలు కొత్త వాటిలా మెరుస్తాయి. మాడిపోయిన మరకలు కూడా సులభంగా తొలగిపోతాయి.

Also Read: Walk In Pollution: వాకింగ్‌కి సరైన సమయం ఏది? ఉదయం పూట నడక సురక్షితమేనా?

సబ్బు- వేడి నీరు

మాడిపోయిన పాత్రను వేడి నీరు, డిటర్జెంట్‌తో కలిపి 15-20 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత శుభ్రమైన స్పాంజ్‌తో నెమ్మదిగా రుద్దండి. పాత్రను మరీ గట్టిగా రుద్దకుండా మెల్లగా శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి. ఈ మూడు పద్ధతుల్లో ఏదైనా ఒక చిట్కాను మీరు ప్రయత్నించవచ్చు. దీని ద్వారా మీ పాత్రలు శుభ్రపడటంతో పాటు మెరుపు కూడా వస్తుంది.

Exit mobile version