Site icon HashtagU Telugu

Brokali 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ బ్రోకలీ 65 రెసిపీ.. ఇంట్లోనే చేసుకోండిలా?

Mixcollage 01 Dec 2023 08 25 Pm 5812

Mixcollage 01 Dec 2023 08 25 Pm 5812

మన వంటింట్లో దొరికే కాయగూరలలో బ్రోకలీ కూడా ఒకటి. అయితే ఈ బ్రోకర్ తో చాలా తక్కువ వంటకాలు మాత్రమే తయారు చేస్తూ ఉంటారు. అందులో కేవలం రెండు మూడు రెసిపీలు మాత్రమే ఇప్పటివరకు మీరు కూడా తిని ఉంటారు. బ్రోకలీ ఫ్రై, బ్రోకలీ మసాలా కూర, బ్రోకలీ పకోడా ఇలాంటివి ట్రై చేసి ఉంటారు. అయితే ఎప్పుడైనా రెస్టారెంట్ స్టైల్ లో బ్రోకలీ 65 రెసిపిని తిన్నారా. ఒకవేళ తినకపోతే రెస్టారెంట్ స్టైల్ లో బ్రోకలీ 65 ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్రోకలీ 65 రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

బ్రోకలీ- 1 పువ్వు
మైదా -అరకప్పు
మొక్కజొన్న పిండి- పావుకప్పు
బియ్యంపిండి-పావుకప్పు
శనగపిండి-పావుకప్పు
కారంపొడి-ఒకస్పూన్
గరం మసాలా-హాఫ్ టీ స్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
పెరుగు- 2టేబుల్ స్పూన్లు
నీళ్లు- పావు కప్పు
నూనె- సరిపడినంత

బ్రోకలి 65 తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా బ్రోకలీని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నీటిలో కాస్త ఉప్పు వేసి ఈ బ్రోకలీ ముక్కలు అందులో వేసి రెండు నిమిషాలు పాటు ఉడికించాలి. అయితే పూర్తిగా ఉడికించడకూడదు. తర్వాత ఒక పెద్ద గిన్నెలు తీసుకొని అందులో కొంచం అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, గరం మసాల, మైదా, మొక్కజొన్న, బియ్యం పిండి, కారంపొడి, ఉప్పు వేసి కొన్ని నీళ్లు ఒక థిక్ పేస్ట్ తయారు చేయాలి. ఆ పిండిలో ఉడికించి పక్కన పెట్టుకున్న బ్రోకలీని వేసి బాగా కలిపాలి. ఇప్పుడు కాగుతున్న నూనెలో ఒక్కో పీస్ వేసుకుంటూ వేయించాలి. బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టాలి. అంతే సింపుల్ బ్రోకలీ 65 రెడీ.

Exit mobile version