Site icon HashtagU Telugu

Brinjal Rice: ఎంతో టేస్టీగా ఉండే బ్రింజల్ రైస్.. సింపుల్ గా ట్రై చేయండిలా?

Mixcollage 19 Dec 2023 07 16 Pm 3076

Mixcollage 19 Dec 2023 07 16 Pm 3076

మామూలుగా మనం వంకాయతో ఎన్నో రకాల రెసిపీలు తినే ఉంటాం. వంకాయ చట్నీ, వంకాయ పుల్లగూర, వంకాయ వేపుడు, గుత్తి వంకాయ, వాంగీ బాత్ ఇలా ఎన్నో రకాల రెసిపీలను తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా వంకాయ రైస్ తిన్నారా. ఎప్పుడు తినకపోతే ఈ రైస్ ని సింపుల్ గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్రింజాల్ రైస్ కి కావాల్సిన పదార్దాలు:-

వంకాయ ముక్కలు – ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు
వేరుసెనగగుళ్ళు – తగినన్ని
మినపప్పు – ఒక చెంచా
జీలకర్ర – కొద్దిగా
నూనె – తగినంత
కొబ్బరి కోరు – రెండు చెంచాలు
నువ్వులు – కొద్దిగా
గసగసాలు – ఒక చెంచా
మెంతులు – అర చెంచా
వాము – కొద్దిగా
ఎండుమిరపకాయలు – తగినన్ని
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
దనియాల పొడి – కొద్దిగా
చింతపండు రసం – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా
ఉడికించి ఉంచిన అన్నం – ఒక కప్పు

బ్రింజల్ రైస్ తయారీ విధానం:-

ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేరుసెనగ గుళ్ళు, మెంతులు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత జీలకర్ర, నువ్వులు, గసగసాలు, ఎండుమిరపకాయలు తగినన్ని వేసి వేయించాలి. అన్నింటిని వేయించిన తర్వాత చల్లార్చి మిక్సి వేయాలి. ఇప్పుడు మరో బాణలి లో వంకాయ ముక్కలు వేయించడానికి సరిపడ నూనె తీసుకుని, వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవగింజలు, సన్నగా తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఇంగువ జోడించితర్వాత వంకాయ ముక్కలు వేయాలి. తర్వాత ఉప్పును, తరిగిన పచ్చి కొబ్బరి, దనియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా మిక్సి వేసి ఉంచుకున్న పొడిని కలపాలి. చిక్కగా రసం తీసి ఉంచిన చింతపండు రసం కలపాలి. తర్వాత దానిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైసు ను కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. చివరగా నెయ్యి వేస్తే బ్రింజల్ రైస్ రెడీ.