మామూలుగా మనం వంకాయతో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. గుత్తి వంకాయ, వంకాయ వేపుడు, వంకాయ చెట్ని, వాంగీ బాద్ లాంటి రెసిపీలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా వంకాయ కొత్తిమీర కారం కూర తిన్నారా. పేరు వెంటనే నోరు ఊరిపోతోంది కదూ. మరి ఈ రెసిపీ ని సింపుల్ గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వంకాయ కొత్తిమీర కారం కూరకు కావలసిన పదార్థాల:
వంకాయలు లేతవి- ఎనిమిది
కొత్తిమీర- ఒక కట్ట
పచ్చిమిర్చి- 8
పసుపు- కొద్దిగా
నూనె – తగినంత
ఉప్పు- తగినంత
వంకాయ కొత్తిమీర కారం కూర తయారీ విధానం :
ఇందుకోసం ముందుగా వంకాయలను కట్ చేసి ఉప్పు వేసిన నీళ్లలో వెయ్యాలి. తరువాత కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి కలిపి మెత్తగా నూరుకోవాలి. ఆపై ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ గుత్తుల్లో ఈ కొత్తిమీర కారం నిండుగా కూరి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్‌లో నూనెవేసి కాగాక ఒక్కో వంకాయని వేసి సన్నని సెగమీద మగ్గనివ్వాలి. తర్వాత ఆ చివరగా కొత్తిమీరతో గ్యార్మిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కొత్తిమీర కారం కూడా రెడీ.
