Site icon HashtagU Telugu

Bread Upma: బ్రెడ్ ఉప్మా.. ఇలా చేస్తే చాలు ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే?

Bread Upma 1

Bread Upma 1

మామూలుగా చాలామంది టిఫిన్స్ లో ఇష్టపడని ఒకే ఒక టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది ఉప్మా అని చెప్పవచ్చు. ఉప్మా పేరు వింటేనే చాలు మాకొద్దు బాబోయ్ అని అంటూ ఉంటారు. ఎప్పుడు ఒకే రకమైన ఉప్మా కాకుండా అప్పుడప్పుడు కాస్త వెరైటీగా చేస్తే ఎప్పుడు ఇష్టపడని వారు కూడా ఇష్టపడి తింటారు. అటువంటి వాటిలో బ్రెడ్ ఉప్మా కూడా ఒకటి. వినడానికి కాస్త వెరైటీగా ఉన్న ఈ రెసిపీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్రెడ్ ఉప్మాకి కావలసిన పదార్థాలు

బ్రెడ్ – 8 ముక్కలు
ఆయిల్ – 2 స్పూన్స్
కారం – 1 స్పూన్
ధనియాలు – ఆఫ్ స్పూన్
జీలకర్ర – ఆఫ్ స్పూన్
ఇంగువ – చిటికెడు
మినపప్పు – 1 స్పూన్
ఉల్లిపాయ – 1 టమాట
కెచప్ – 1 స్పూన్
కరేపాకు – ఒక రెమ్మ
పసుపు – చిటికెడు
పంచదార – ఒక స్పూన్
ఉప్పు – సరిపడా

బ్రెడ్ ఉప్మా తయారీ విధానం

ఇందుకోసం ముందుగా బ్రెడ్ ముక్కల అంచులు కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు ,ధనియాలు , జీలకర్ర, కారం కరేపాకు, ఇంగువ ఇంకా మినపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. తరువాత ఒక స్పూన్ టమాటో కెచప్, పసుపు, సాల్ట్ బాగా కలపాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు కూడా వెయ్యాలి. తరువాత పంచదార వేసి ఒక ఐదు నిముషాలు ఫ్రై అవ్వనివ్వాలి అంతే
బ్రెడ్ ఉప్మా రెడీ..

Exit mobile version