Bread Omelette: పిల్లలు ఎంతగానో ఇష్టపడే బ్రెడ్ ఆమ్లెట్ ను ఇంట్లోనే ట్రై చేయండిలా?

మామూలుగా పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే ఫుడ్ ఐటమ్స్ లో బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఒకటి. ఎక్కువగా ఈ రెసిపీని స్నాక్ ఐటమ్ గా త

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 06:40 PM IST

మామూలుగా పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే ఫుడ్ ఐటమ్స్ లో బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఒకటి. ఎక్కువగా ఈ రెసిపీని స్నాక్ ఐటమ్ గా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలామందికి ఈ రెసిపీ ని ఒక్కసారి అయినా తినాలని ఉంటుంది కానీ ఎలా చేసుకోవాలో తెలియక మౌనంగా ఉంటారు. మరి బయట చేసిన విధంగానే బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్రెడ్ ఆమ్లెట్ కు కావలసిన పదార్థాలు:

బ్రెడ్ స్లైసులు – 4
గ్రుడ్లు – 2
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 2
టొమాటో – 1
కొత్తిమీర – 1 కట్ట
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
మిరియాల పొడి – ¼ టీ స్పూన్
నూనె – 1 టేబుల్ స్పూన్
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్

బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర సన్నగా తరగాలి. వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని పసుపు, ఉప్పు, మిరియాల పొడిని కలపాలి. దీనిలో గ్రుడ్లు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి, నెయ్యి వేసి బ్రెడ్ స్లైసులు రెండు వైపులా కాల్చాలి. కాల్చిన బ్రెడ్ స్లైసుల పైన కొద్దిగా టొమాటో సాస్ పూయాలి. తరువాత పెనం మీద కొద్దిగా నూనె వేసి, ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్ కట్ చేసి బ్రెడ్ స్లైసుల మద్యలో పెట్టాలి. అంతే తో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ.